Tirupati: తిరుపతిలో 4 హోటల్స్ కు ముప్పు.. పేల్చేస్తామని ఉగ్రవాదుల బెదిరింపులు..!

Tirupati Hotels Boma Threat: తిరుమల తిరుపతి దేవస్థానం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ప్రాంతంలో బాంబు బెదిరింపులు అందరినీ కలకలానికి సృష్టిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో అర్ధరాత్రి అలజడి రేకెత్తింది. పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదుల పేరుతో తిరుపతి నగరంలోని కొన్ని హోటల్స్ కి ఈ - మెయిల్స్ వచ్చాయి. 
 

1 /6

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో.. అర్ధరాత్రి వాతావరణం ఉద్రిక్తత గా మారింది. ప్రత్యేకించి కొన్ని హోటల్స్ కి బాంబ్ బెదిరింపుల మెయిల్స్ రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆ మెయిల్ లు.. చూసి హోటల్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ఆ మెయిల్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.  

2 /6

అర్ధరాత్రి సమయంలో ప్రత్యేకించి నాలుగు హోటల్ యజమానులకు ఈ - మెయిల్ వచ్చింది. అందులో మీ హోటల్లో బాంబులు పెట్టాం..అర్ధరాత్రి పేలిపోతాయి. కాబట్టి వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి.. అంటూ ఆ మెయిల్స్ సారాంశం. దీంతో హోటల్ యజమానులు అప్రమత్తమై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

3 /6

అక్టోబర్ 24 అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి నగరంలోని లీలామహల్ సెంటర్లోని మూడు ప్రముఖ ప్రైవేట్ హోటల్స్ తో పాటు రామానుజ సర్కిల్లోని మరో ప్రైవేట్ హోటల్ కి ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం.

4 /6

సమాచారం అందుకున్న పోలీసులు  పరుగులు పెట్టారు 2024 అక్టోబర్ 24 వ తేదీ అర్ధరాత్రి నుంచి 2024 25వ తేదీ ఉదయం వరకు అన్ని హోటల్స్ ని కూడా తనిఖీ చేశారు. డాగ్ స్క్వాడ్ , బాంబు స్క్వాడ్ తో హోటల్స్ లోని ప్రతి గదిని ,ప్రతి ప్రదేశాన్ని తనిఖీ చేశారు.ఆయా హోటల్స్ లో ఉన్న భక్తులు పర్యాటకులను సైతం విచారించారు. ఆ తర్వాత అక్కడ ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే మళ్లీ భక్తులను హోటల్లోకి అనుమతించారు పోలీసులు. ప్రస్తుతం ఈ విషయం చాలా సంచలనంగా మారింది. 

5 /6

ఇంతకీ బాంబు బెదిరింపులకు కారణం ఏంటంటే..  పాకిస్తాన్ టెర్రరిస్ట్ జాఫర్ సాదిక్ జైలు శిక్ష పై ఉగ్రవాదులు ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.. ఉగ్రవాది జాఫర్ సాధిక్ కు  శిక్ష పడే.. విధంగా తమిళనాడు ప్రభుత్వం సహకరించడం తమకు నచ్చలేదని ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. 

6 /6

అందులో భాగంగానే తిరుపతిలోని.. పుణ్యక్షేత్రాలను కూడా టార్గెట్ చేసినట్లు ఈ మెయిల్ లో ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిత్యం లక్షల మంది భక్తులు వచ్చే తిరుపతి పుణ్యక్షేత్రంపై టెర్రరిస్ట్ టార్గెట్ చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని తిరుపతి వాసులు భయం గుప్పెట్లో ఉన్నారని చెప్పవచ్చు