How To Start A Clay Cups Business: మట్టి కప్పుల బిజినెస్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన వ్యాపార అవకాశాలలో ఒకటి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, పర్యావరణం పట్ల మంచి అనుబంధాన్ని పెంచే ఐడియా కూడా. ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
How To Start A Clay Cups Business: ప్రస్తుతం ఉద్యోగాలు లభించడం కష్టంగా మారడంతో స్వయం ఉపాధి వైపు చాలామంది ఆకర్షితులవుతున్నారు. కానీ స్వయం ఉపాధికి భారీ పెట్టుబడి అవసరం అనే భావన చాలామందిలో ఉంది. అయితే ఇది పూర్తిగా నిజం కాదు. చిన్న పెట్టుబడితో కూడా బోలెడు లాభాలు పొందవచ్చు. అయితే కేవలం రూ. 5వేలతో పెట్టుబడితో నెలకు రూ. 60వేల వరకు సంపాదించే బిజినెస్ గురించి తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల కోసం వెతుకుతున్న వారికి మట్టి కప్పుల వ్యాపారం చాలా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇది కేవలం టీ తయారీదారులు, రెస్టారెంట్లకే పరిమితం కాకుండా, హోటళ్లు, కార్యాలయాలు, వివాహాలు ఇతర సామాజిక కార్యక్రమాలలో కూడా విస్తృతంగా ఉపయోగపడుతాయి.
ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ ప్రాంతంలో మట్టి కప్పులకు ఉన్న డిమాండ్‌ను అంచనా వేయండి. టీ తయారీదారులు, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సంప్రదించాల్సి ఉంటుంది.
మట్టి కప్పుల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మన పూర్వీకులు అధికంగా వీటినే ఉపయోగించేవారు. ఇప్పుడు మళ్ళీ మట్టి కప్పుల వైపు మనం మొగ్గు చూపుతున్నాం.
మట్టి కప్పులు పూర్తిగా సహజమైనవి. వీటిలో ఎలాంటి రసాయనాలు ఉండవు. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఎలాంటి ఆహారాన్ని అయిన వండుకోవచ్చు. మట్టి కండలు, కప్పులో తయారు చేసే ఆహారం రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
మట్టి కప్పుల వ్యాపారం కేవలం చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఉదాహరణకు: రూ. 5వేల పెట్టుబడి పెడితే నెలకు రూ. 20వేల సంపాదించవచ్చు. మార్కెట్ డిమాండ్ బట్టి మరింత ఎక్కువ డబ్బు పొందవచ్చు.
ఒక కప్పు రూ.30 నుంచి రూ.60 చిన్న కప్పులు, రూ. 60 -100 వరకు పెద్ద సైజు కప్పులకు ధర నిర్ణయించడం వల్ల రోజుకు రూ.2,000 ఆదాయం పొందవచ్చు.
దీంతో పాటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మీ ఉత్పత్తులను ప్రచారం చేయడం వల్ల నెలకు రూ. లక్షలు సంపాదించవచ్చు.