Shilpa Shetty: అప్పట్లో ఆ హీరోతో ఎఫైర్ తో వార్తల్లో నిలిచిన సాగరకన్య..

Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు చెబితే యూత్ కు పులకించిపోయేవారు. అప్పటి కుర్రకారుకు ఆరాధ్య దేవత. ఇక సాగరకన్య గురించి తెలుగు ప్రేక్షకులకు  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి అందాల సోయగం. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయిన ఈ భామ అప్పట్లో ఓ హీరోతో చేసిన ఆఫ్ స్క్రీన్ రొమాన్స్ తో వార్తల్లో నిలిచింది.

1 /6

శిల్పా శెట్టి.. ప్రస్తుతం ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని సౌందర్యంతో  కుర్రాళ్లను కుళ్లు కొనేలా చేస్తోంది. మధ్యలో మూవీలకు దూరమైనా.. తన యోగాసనాలతో ఫ్యాన్స్ కు  ఎపుడు దూరం కాలేదు. ఏజ్ 50 యేళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే ఉంది.

2 /6

శిల్పాశెట్టి దిన చర్య ప్రతి రోజు యోగాసనాలతో స్టార్ట్ అవుతోంది. యోగాసనాలతో పాటు వేపుళ్లు, చిరు తిండ్లకు దూరంగా ఉండటమే శిల్పా శెట్టి బ్యూటీ సీక్రెట్.

3 /6

ఆ సంగతి పక్కన పెడితే.. ఈమె అప్పట్లో ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో చెట్టా పట్టాలేసుకొని తిరిగింది. అంతేకాదు కాదు అతనితో పలు సినిమాల్లో నటించింది. అప్పటికే వేరే హీరోయిన్ తో బ్రేకప్ చెప్పిన ఆ హీరో.. ఈమెతో కొన్నాళ్లు డేటింగ్ గట్రా చేసాడు.ఆ తర్వాత ఏమైందో ఏమో వీళ్లిద్దరు తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసారు.

4 /6

సదరు స్టార్ హీరో మాత్రం.. వేరే హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతోనే ఉంటూ ఎఫైర్స్ కు దూరంగా ఉంటున్నాడు.  శిల్పా శెట్టి మాత్రం రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకొని సెటిలైపోయింది.

5 /6

శిల్పాశెట్టి .. రీసెంట్ గా  ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో  మెప్పించింది.

6 /6

శిల్పాశెట్టి సినిమాల విషయానికొస్తే.. హిందీలో షారుఖ్ హీరోగా నటించిన 'బాజీఘర్'మూవీతో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పా శెట్టికి విడదీయరాని   అనుబంధమే ఉంది.