2024 No Nut November: నో నట్ నవంబర్ .. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌ను ప్రధానంగా పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక నెల పాటు పురుషులు మాస్టర్ బిట్ చేసుకోకుండా ఉండటమే ఈ నో నట్ నవంబర్ ఛాలెంజ్. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం ఇలా చేయడం వల్ల కొంత మేలు జరుగుతుందని సూచిస్తున్నాయి. అసలు మాస్టర్ బిట్ చేసుకోవడం మంచిదేనా ..? ఒక నెల పాటు చేసుకోకుండా ఉండటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి.? అనేది తెలుసుకుందాం.
మాస్టర్ బిట్ అనేది లైంగిక అవయవాలకు లేదా లైంగిక చర్యలకు సంబంధించిన పదం. సామాజిక మాధ్యమాలలో ఈ పదం గట్టిగా వినిపిస్తుంటుంది.
మాస్టర్ బిట్ ను తెలుగులో హస్తప్రయోగం అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి హాని చేయదు కానీ చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంది.
హస్తప్రయోగం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతుంటారు. ఇది మంచి నిద్రకు దోహదపడుతుందని నమ్మకం.
అయితే ఒక నెల పాటు హస్తప్రయోగం చేయకపోవడం వల్ల కలిగే లాభాలు గురించే మనం తెలుసుకుందాం.
అధికంగా హస్తప్రయోగం చేయడం వల్ల మనోవైకల్యాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక నెల పాటు హస్తప్రయోగం చేయకపోవడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది.
నో నట్ నవంబర్ వల్ల హస్తప్రయోగంపై అదుపు సాధించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా భావించకూడదు.