Samsaptak Drishti Effect: జనవరి రెండు వరకు సంసప్తక దృష్టి ప్రభావం ద్వాదశ రాశుల వారిపై కొనసాగుతుంది. కాబట్టి కొన్ని రాశుల వారు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. వీరికి జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది.
Samsaptak Drishti Effect In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి వెళ్లడం ఒకే రాశిలో రెండు గ్రహాలు కలవడం తిరోగమనం చేయడం ఇవన్నీ ద్వాదశ రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఇదిలా ఉంటే నవంబర్ నెలలో ఎంతో ప్రత్యేకత కలిగిన బుధుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీనికి తోడు గురు గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ రెండు గ్రహాలు వేరువేరు రాశుల్లోకి సంచారం చేయడం కారణంగా ఎంతో ప్రభావంతమైన సంసప్తక దృష్టి ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
బుధ గురు గ్రహాల సంసప్తక దృష్టి ప్రభావం 2025 సంవత్సరం జనవరి 4వ తేదీ వరకు కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం వృద్ధితోపాటు కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందని వారంటున్నారు.
సంసప్తక దృష్టి కారణంగా మొదట ప్రభావితమయ్యే రాశుల్లో వృషభరాశి ముందుంటుంది. ఈ రాశికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరికి అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. దీంతోపాటు వృషభ రాశి వారికి ఈ సమయంలో విపరీతమైన ఆర్థిక లాభాలు కలిగే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అలాగే వృషభ రాశి వారికి కొన్ని పనుల్లో అనుకూలత కూడా పెరుగుతుంది. దీని కారణంగా వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు ఇక ఉద్యోగాలు చేసే వారి విషయానికొస్తే వీరు ఎలాంటి పని ప్రారంభించిన అఖండ విజయాలు సాధిస్తారు. దీనికి తోడు డబ్బు కూడా వస్తుంది.
సంసప్తక దృష్టి ఎఫెక్ట్ కర్కాటక రాశి వారిపై కూడా పడుతుంది. దీంతో వీరు చేస్తున్న పనుల్లో అద్భుతమైన ప్రయోజనాలకు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసినా వీరిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఆస్తుల వివాదాలు కూడా కొంతవరకు పరిష్కారం అవుతాయి. అలాగే సంతాన భాగ్యం కూడా కలుగుతుంది.
సింహరాశి వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకునే ఛాన్స్ కూడా ఉంది. రాజకీయ రంగాలకు సంబంధం ఉన్న వ్యక్తులు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి విదేశీ పర్యటనలు కూడా చేసే ఛాన్స్ ఉంది. అలాగే వీరు ఈ సమయంలో ఎప్పుడు పొందలేని ఆనందం కూడా పొందుతారు.