Naga Chaitanya- Shobitha wedding Venue: నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఆగష్టులో కొంతమంది కుటుంబ సభ్యుల నడుమ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థాన్ని హీరో నాగార్జున సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. అయితే, ఇటీవలె పసుపు దంచుడు కార్యక్రమం కూడా మొదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 న వీరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే, వెడ్డింగ్ వెన్యూ, గెస్టులు ఎవరు వస్తున్నారు తెలుసా?
ఆగస్టు ఈ సంవత్సరం నాగచైతన్య, శోభితల నిశ్చితార్ధం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 4న పెళ్లి ముహూర్తం ఖరారు అయింది. అయితే, శోభిత- చైతన్యలు రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత ఒక్కటవ్వనున్నారు. వీరు ఓ పార్టీలో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. వీరి పెళ్లి వేదిక ఎక్కడ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాగచైతన్య మొదటి పెళ్లి సమంతతో జరిగింది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. వీరి పెళ్లి గోవాలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే, ఇప్పుడు చై రెండో పెళ్లి కూడా విదేశాల్లో లేదా రాజస్థాన్‌లో జరుగుతుంది అని అనుకున్నారు. కానీ, వారి పెళ్లి వేదిక అన్నపూర్ణ స్టూడియోలో జరగనుందని తెలుస్తోంది.
నాగచైతన్య కుటుంబ వారసత్వంగా ఉన్న ఈ స్టూడియోలోనే చై-శోభితల పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ప్రముఖ దివంగత సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను నిర్మించారు. ఈయన హీరో నాగర్జున తండ్రి. అందుకే అక్కడే వివాహ వేదికగా ఎంచుకున్నారు అని తెలుస్తోంది. అయితే, హైదరాబాద్‌లోనే చై- శోభితల నిశ్చితార్ధం జరిగింది. ఇక పసుప దంచుడు కార్యక్రమం కూడ శోభిత వాళ్ల సొంతూరు విశాఖపట్టణంలో సంప్రదాయబద్ధంగా జరగనుంది.
పెళ్లికి వచ్చే గెస్టుల విషయానికి వస్తే కొంతమంది ప్రముఖ గెస్టుల నడుమ ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వనున్నారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లి వేడుకకు ఆహ్వానిస్తున్నారు. వీళ్లు డేటింగ్ కూడా సీక్రెట్‌గానే ఉంచారు, అధికారికంగా సోషల్ మీడియాలో నిశ్చితార్ధం ఫోటోలు షేర్ చేసే వరకు అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు.
నాగచైతన్యకు సమంతతో మొదటి వివాహం గోవా వేదికగా 2017 లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం సమంత బాలివుడ్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితాలు 2022 లోనే పరిచయం అవ్వడం ఆ తర్వాత డేటింగ్ చేశారు. ఆగష్టులో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్లో పెళ్లి జరగనుంది.