Tomorrow Telangana Schools And Govt Office Holiday: రెండు పర్వదినాలు ఒకేరోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవును ప్రకటించింది. విద్యార్థులకు, ఉద్యోగులకు సెలవును ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.
శుభవార్త: విద్యార్థులు, ఉద్యోగులకు మరో శుభవార్త. కార్యాలయాలు, విద్యాలయాలకు శుక్రవారం సెలవు లభించింది.
రెండు పండుగలు: సిక్కులు, హిందూవులకు ప్రధానమైన దినం రావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
గురునానక్ జయంతి: సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యాలయాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కార్తీక పౌర్ణమి: కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి. శివుడికి అత్యంత ప్రియమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా సెలవు రావడం విశేషం.
ప్రభుత్వ సెలవు: రెండు పర్వదినాలు ఒకేరోజు రావడంతో తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
ఏపీలో మాత్రం: ఆంధ్రప్రదేశ్లో మాత్రం విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు పబ్లిక్ హలీడేగా ప్రకటించలేదు. శుక్రవారం ఆప్షనల్ హలీడేగా ప్రకటించారు.