AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక

AP Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులుగా చెదురు ముదురు వానలు కురుస్తున్నాయి..ఈ నేపథ్యంలో నేడు కూడా ఏపీలోని నాలుగు ప్రధాన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం నేడు ఉందని ఐఎండి హెచ్చరిక చేసింది.
 

1 /5

తెలుగు రాష్ట్రాల్లో నేడు వర్షం పడే అవకాశం ఉంది అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. నిన్న కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. దీంతోపాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

2 /5

ఏపీలోని ప్రకాశం బాపట్ల, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి వంటి ప్రధాన జిల్లాల్లో వర్షాలు రెండు రోజులుగా కురుస్తున్నాయి. వరి కోతకి వెళ్లే రైతులు ఈ నేపథ్యంలో జాగ్రత్త తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది.  

3 /5

ఇప్పటికే తుఫాను నేపథ్యంలో రైతులు ఆందోళనలో ఉన్నారు. వరి కోతకు వెళ్తున్నారు అంతేకాదు వారు ధాన్యం కూడా రోడ్డు పక్కన ఆరబెడుతున్నారు. ఈ నేపథ్యంలో వర్షాలు వారిని ఇబ్బంది పెడుతున్నాయి.  

4 /5

అయితే ఏపీలోని కోనసీమ, బాపట్ల, కృష్ణ, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో  నేడు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.ఇక పల్నాడు అన్నమయ్య చిత్తూరు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.  

5 /5

ఇక తెలంగాణలో కూడా వర్షం అక్కడక్కడ చెదురుమదురుగా పడుతున్నాయి. ఉష్ణోగ్రత స్థాయిలో ఒక్కసారిగా పడిపోయాయి రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం తిరిగి మాములు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.