Nagamani Pearl: అరుదైన రియల్ నాగమణిని చూశారా.. ఆ వజ్రాన్ని చూసే ధైర్యం మీకుందా?

Nagamani Pearl Original Pics Here: ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామస్తులు చిత్రీకరించిన నాగమణి రత్నానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి నేటిజన్స్ నాగమణి రత్నం నిజంగా ఉంటుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. నిజానికి వైరల్ అవుతున్న ఫొటోస్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.

Nagamani Pearl Original Latest Pics Here: పురాణాల ప్రకారం నాగమణినికి ఎంతో ప్రత్యేకమైన శక్తి ఉందని నమ్ముతారు. అలాగే ఇది నాగుపాము పడగలోని పై భాగంలో తయారవుతుందని కూడా భావి. దీని గురించి చాలామంది సినిమాల్లో వివిధ సన్నివేశాల్లో చూసి ఉంటారు. కానీ ఈ నాగమణి రత్నం గురించి హిందూ పురాణాల్లో కూడా ఎంతో క్లుప్తంగా పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నాగమణికి సంబంధించిన కొన్ని ఫొటోస్ బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.
 

1 /9

పురాణాల ప్రకారం కూడా నాగమణి ఎంతో శక్తివంతమైన నాగుపాము పై తల భాగంలో తయారవుతుందని సమాచారం. అలాగే ఈ నాగమణి ఉన్న పాము ఎంతో పవర్ఫుల్ గా కూడా భావిస్తారు. ఈ పాములు వందేళ్లు జీవిస్తాయట.  

2 /9

ప్రస్తుతం రాజస్థాన్లోని ఓ ప్రాంతమైన కోటాలో ఇటీవలే కొంతమంది స్థానికులు నాగమణి కి సంబంధించిన ఫోటోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాలకు సంబంధించిన స్థానికులు కూడా నాగమణికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలారు.     

3 /9

ప్రస్తుతం వారు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో ఒక పెద్ద పాము తన తలపై భాగంలో దగదగా మెరుస్తూ నాగరత్నాన్ని చూడవచ్చు. అంతేకాకుండా మీకు ఈ ఫోటోలు పాము తల భాగంలో వజ్రం నుంచి కాంతి రావడం కూడా గమనించవచ్చు.  

4 /9

అయితే మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో స్థానికులంతా ఒకచోట కలిసి శివపురాణం వింటున్న సందర్భంలో ఈ పాము అడవి ప్రాంతం నుంచి అక్కడికి చేరుకుందట. దగదగా మెరుస్తున్న పాము స్థానికుల కంట్లో పడడంతో వారంతా దీనిని మొబైల్స్ లో ఫోటోలు తీశారు.     

5 /9

అలాగే ఈ నాగమణి రత్నం కొన్ని ఫొటోస్ లో అచ్చం చూడడానికి వజ్రంగా కనిపించడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాకుండా ఆ వజ్రం నుంచి కాంతి రావడం ఒక శక్తిని అక్కడి స్థానికులు మాట్లాడుకుంటున్నారట. అక్కడి స్థానికులు ఏకంగా నాగదేవత తమ గ్రామానికి వచ్చిందని నమ్మారట.  

6 /9

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు మధ్యప్రదేశ్ లోని ఏ గ్రామంలో నుంచి వచ్చాయో అన్న పూర్తి వివరాలు తెలీదు. కానీ ఈ ఫొటోస్ మాత్రం నిజమని చాలామంది అనుకుంటున్నారు.    

7 /9

ఈ ఫొటోస్ చూసిన చాలామంది నాగమణి నిజం కాదని.. ఈ ఫోటోలను కావాలనే ఎవరూ మార్ఫింగ్ చేశారని.. నాగమణి కి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేవని ప్రచారం చేస్తున్నారు.    

8 /9

పౌరాణిక కథల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. నాగమణి ఎవరి దగ్గరైనా ఉంటే వారు ధనవంతులవ్వడమే కాకుండా.. అనేక శక్తులను కూడా కలిగి ఉంటారని సమాచారం. అంతేకాకుండా వీరిని ఏ పాములు ఏం చేయవని స్థానికుల నమ్మకం కూడా..  

9 /9

ప్రస్తుతం వైరల్ అవుతున్న నాగమణి కి సంబంధించిన ఫోటోలు జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించదు. ఈ ఫొటోస్ ని కేవలం జరుగుతున్న ప్రచారం ఆధారంగా తీసుకొని మాత్రమే ఈ కథనాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..