Pista Health Benefits: డ్రైఫూట్స్‌లో పిస్తా ఎంతో ప్రత్యేకరమైన పదార్థం. ఇది చూడడానికి చిన్నగా, పచ్చగా ఉంటుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపణులు చెబుతున్నారు. ప్రతిరోజు పిస్తా పప్పు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
పిస్తా పప్పులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
పిస్తా పప్పులలో మంచి కొవ్వులు, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించి, గుండె సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.
అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో పిస్తా పప్పు ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
పిస్తా పప్పులు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి.
పిస్తా పప్పులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పప్పులు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
రోజుకు కొన్ని పిస్తా పప్పులు సరిపోతాయి. అయితే, ఎక్కువగా తింటే కేలరీలు అధికంగా అవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.