Liquor: మందుబాబులకు డబుల్‌ కిక్కిచ్చే అప్డేట్‌.. ఆ ప్రముఖ బ్రాండ్లు కూడా రూ. 99కే విక్రయం..

AP Liquor News: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో భారీ శుభవార్తను చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం. దీంతో వారికి డబుల్‌ కిక్కెచ్చే వార్త అయింది. ఇప్పటికే రూ.99 కు విక్రయిస్తున్న మద్యంతో ఇది బంపర్‌ ఆఫర్ అంటున్నారు మద్యం ప్రియులు..
 

1 /7

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మద్యం విక్రయాలకు షాపులను లాటరీ విధానంలో ఎంపిక చేసింది. దీంతో కొత్త షాపులు కూడా ఏర్పాటు అయ్యాయి. అంతేకాదు ఆ దుకాణాల్లో కేవలం రూ.99 విక్రయాలు చేపట్టింది.  

2 /7

అయితే, చాలామంది మందుబాబులు మంచి పేరు పొందిన మందు కూడా రూ.99 కే విక్రయిస్తే బాగుండు అని ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూశారు. వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది.  

3 /7

ప్రముఖ బ్రాండ్లు జాతీయ స్థాయిలో కూడా పేరున్న మద్యంను కూడా రూ.99 కే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.  

4 /7

ప్రధానంగా రూ.99 కే మద్యం విక్రయిస్తుండటంతో భారీగా ఆదరణ వస్తోంది. ఈ నేపథ్యంలో పేరున్న బ్రాండ్లను కూడా అతి తక్కువ ధరకే విక్రయిస్తే మద్యం అమ్మకాలు కూడా పెరుగుతాయని యోచిస్తోంది.  

5 /7

త్వరలో ప్రముఖ బ్రాండ్లను కూడా రూ.99 కే విక్రయించేలా చూస్తామని మంత్రి అన్నారు. దీంతో వాటి ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతుంది అని మంత్రి చెప్పారు. అయితే, ఇటీవలె మద్యం ధరపై కనీస ఛార్జీల విషయంపై పలు చర్చలు జరిగాయి.  

6 /7

అయితే, మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నవారు మాత్రం కాస్త అసహనంగా ఉన్నారు. ఎందుకంటే మార్జిన్‌ సరిగ్గా రావడం లేదని ప్రభుత్వం కాస్త పెంచితే బాగుంటుంది. ఇలా అయితే, వ్యాపారం కష్టం అని చెబుతున్నారు.  

7 /7

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి కూడా చర్యలు తీసుకుంటుంది. కొత్త బ్రాండ్ల మద్యంతోపాటు టెట్రా ప్యాక్‌ల, చిన్న చిన్న సీసాల్లో కూడా మద్యం విక్రయించడంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.