AP Rains: నైరుతి ఋతుపవనాలు ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలో అమరావతితో పాటు విజయవాడు పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
ap cm Chandrababu reacts on Siddantham elderly man video: ఏపీ సీఎంను చూసి ఆయనకు నమస్తే అని చెప్పాలని ఉందని పెద్దాయన సానబోయిన సత్యనారాయణమాట్లాడిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. రేపు సిద్దాంతం సమావేశంలో కలుద్దామని ట్విట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
AgriGold:ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Deputy cm pawan Kalyan press meet: తెలంగాణ ముమ్మాటికీ ఆ ప్రాంత భూమిపుత్రులదేనని పవన్ కళ్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా.. ఏపీ నుంచి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేస్తామంటున్నారని అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
Home Minister Anita: అనిత గాజువాకలో చికిత్స పొందుతున్న గాయపడిన హోం గార్డును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విధి నిర్వహణలో గాయపడిన పోలీసు సిబ్బందికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు. అనిత పరామర్శతో పోలీసు శాఖలో ఉత్సాహం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
MLC Perabathula Rajasekhar: పేరాబత్తుల రాజశేఖర్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయాలు, పరిపాలనకు సంబంధించిన పలు అంశాలపై స్పందించిన ఆయన.. జగన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ పనితీరుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మారేడుమిల్లి అటవీ సిబ్బందిని అభినందించారు. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో వారు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. కఠిన పరిస్థితుల్లోనూ అంకితభావంతో పనిచేస్తున్న ఫారెస్ట్ సిబ్బందికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అటవీ శాఖలో ఉత్సాహాన్ని పెంచగా, ఈ అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Vijayawada: కనకదుర్గ ఆలయం లోని ఇంద్రకీలాద్రికి వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్లు బొర్రా రాధాకృష్ణ తెలిపారు. పెరుగుతున్న భక్తుల రద్దీ, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రెండో ఘాట్ నిర్మాణం పూర్తైతే భక్తులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ఈ ప్రకటనతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
AP Political News: ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు నివాసానికి ఏపీ పోలీసులు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై రాజకీయ, ప్రజా వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.
YS Avinash Reddy: ఎమ్మెల్సీ టికెట్ బేరసారాల నేపథ్యంలో కడప రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీటెక్ రవికి వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన ఘాటు హెచ్చరిక ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ap Government Anganwadi Gratuity: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సహాయకులకు భారీ ఊరటనిచ్చింది. వారు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ (పదవీ విరమణ ప్రయోజనాలు) చెల్లింపు కోసం ప్రభుత్వం ఏకంగా రూ.19.70 కోట్ల అదనపు నిధులను మంజూరు చేసింది.
CM Chandrababu On Population: నేడు శ్రీకాకుళంలోని నర్సన్నపేటలో జరిగిన "స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి గురించి మాట్లాడుతూనే జనాభా పెరుగుదల అవసరమని ఆయన అన్నారు. జనాభా పెరుగుదలకు ప్రోత్సాహంగా మూడో బిడ్డకు రూ.30,000.. అలాగే నాలుగో బిడ్డ పుట్టిన తర్వాత రూ.40,000 అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Puttaparthi AMCA Laying Foundation: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
AP Cabinet Meeting News: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం దాదాపుగా 40కి పైగా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, పొదుపు చర్యలు, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
AP CM Chandrababu Convoy News: ఇంధన పొదుపు చర్యలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ దిశగా అడుగులేశారు. వారి కాన్వాయిలో 50 శాతానికి వాహనాలను కుదించాలని వారు నిర్ణయించారు. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్‌లో 4 వాహనాలు.. పవన్ కల్యాణ్ కల్యాణ్ కాన్వాయ్‌లో 3 వాహనాలు ఉన్నాయి.
PM Modi Visit CBN Residence: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను సందర్శించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కూటమి నేతల ఇంటికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు వ్యక్తిగత అనుబంధాన్ని చాటుతూ ఈ పర్యటన సాగింది.
Marella Village Tree Miracle: ప్రకాశం జిల్లాలో ఒక అపూర్వమైన ఘట్టం జరిగింది. నరికివేసి, వేళ్లతో సహా పెకిలించి పక్కన పడేసిన రావిచెట్టు.. రాత్రికి రాత్రే తిరిగి నిలబడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇది ప్రకృతి వింతానా లేక ఆ బ్రహ్మంగారి మహిమ భక్తులు వేల సంఖ్యలో మారెళ్ల గ్రామానికి తరలిస్తున్నారు.
Andhra Pradesh Investment Hub: నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Government News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ విద్యా ప్రమాణాల బాటలో తీసుకెళ్లేందుకు విద్యశాఖ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ టీచర్స్‌ను సింగపూర్ పర్యటనకు తీసుకెళ్లి.. అక్కడి విద్యావిధానలపై ప్రత్యేకమైన అవగాహన కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Petrol and diesel shortage:ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కొన్ని పెట్రోల్ బంకుల ముందు 'నో స్టాక్' బోర్డులు పెట్టడం, ప్రజలు క్యూలలో నిలబడటం వంటి పరిణామాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేవలం సప్టై లోని లోపాల వల్ల ఈ సిట్యువేషన్ ఏర్పడిందన్నారు. ఇంధన నిల్వలకు మాత్రం లోటు లేదన్నారు. పెట్రోల్ బంకుల వద్ద శాంతి భద్రతల సమస్యలు రాకుండా పోలీసులతో గస్తీ నిర్వహించాలన్నారు.
AP CM NSG Commando Faints: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడు విజయవాడ పటమటలోని ఓ అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. అందులో భాగంగా ఆయన అక్కడి వారితో కలిసి అల్పాహారాన్ని భుజించారు. అయితే అంతా పూర్తయ్యాక మీడియాతో సీఎం మాట్లాడుతున్న క్రమంలో ఆయన సెక్యూరిటీ ఎన్ఎస్జీ కమాండో ఒకరు తూలి పడిపోయారు. దీంతో వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు.
Road accident in alluri district: చింతపల్లి జాతర నుండి తిరిగి వస్తున్న సమయంలో ఘాట్ రోడ్డులో వ్యాన్ అదుపు తప్పి కొండకు ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులు ఎగిరి కింపడ్డారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.