Sridevi Death Mystery: నాగార్జున సాక్ష్యం..?.. శ్రీదేవీ మరణానికి అదే కారణమంటూ షాకింగ్ నిజం బైటపెట్టిన బోనీ కపూర్.. ఏమన్నారంటే..?

Boney Kapoor on sridevi death: నిర్మాత బోనీకపూర్ శ్రీదేవీ మరణంపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి. ఈ నేపథ్యంలో మళ్లీ శ్రీదేవీ ఫ్యాన్స్ తమ ఫెవరెట్ హీరోయిన్ ను తల్చుకుని ఎమోషనల్ అవుతున్నారంట.

1 /6

అతిలోక సుందరీ శ్రీదేవీ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు.చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. అప్పట్లోనే పెద్ద పెద్ద హీరోలతో సరిసమానంగా నటించి అందర్ని ఆశ్చర్యపరిచిందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీని మాత్రం శ్రీదేవీ ఒక ఊపు ఊపేసిందని చెప్పుకొవచ్చు. ఆమెతో నటించడానికి హీరోలు సైతం.. తెగ ఆసక్తి చూపించే వారంట.  

2 /6

   శ్రీదేవీ తన అందం, అభినయంతో తనకంటూ తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా.. ఇతర ఇండస్ట్రీలలో సైతం తన మార్కు చూపించింది. ఈ క్రమంలో శ్రీదేవీ మరణం మాత్రం ఇప్పటికి మిస్టరీగానే ఉందని చెప్పుకొవచ్చు. 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె స్టే చేసిన హోటల్ లోని బాత్ టబ్ లో పడి మరణించింది. దుబాయ్లో పెళ్లికి వెళ్లి విగతజీవిగా మారడం అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేసిన విషయం తెలిసిందే.

3 /6

అందరు కూడా తొలుత.. బోనీకపూర్ ను అనుమానించినట్లు తెలుస్తొంది. దుబాయ్ పోలీసులు బోనీకపూర్ ను అదుపులోకి తీసుకుని..లైవ్ డిటెక్టర్ తో పాటు.. అనేక విధాలుగా క్రాస్ ఎగ్జామినేషన్స్ సైతం చేశారంట. చివరకు బోనీ కపూర్ కు .. ఈ ఘటనకు సంబంధంలేదని చెప్పారంట.  

4 /6

అయితే.. ఇటీవల బోనీకపూర్ తన భార్య మరణం గురించి ఒక ఇంటర్వ్యూలో మళ్లీ మాట్లాడరంట. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శ్రీదేవీ ముఖ్యంగా డైట్ విషయంలో చాలా సీరియస్ గా ఉండేదని తెలుస్తొంది. ఆమె ఉప్పును అస్సలు తినేది కాదంట. దీంతో పలు మార్లు ఆమె లోబీపీతో పడిపోయేదంట. అయిన కూడా ఆమె తన డైట్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గేది కాదంట.

5 /6

 ఈ క్రమంలో దుబాయ్ లో కూడా.. ఆమె కళ్లు తిరిగి బాత్రూమ్ లోని ట్రబ్ లో పడిపోయి ఉండోచ్చని వాదనలు అప్పట్లో బలంగా విన్పించాయి. ఆమె మరణించిన తర్వాత హీరో నాగార్జున బోనీకపూర్ ను పరామర్శించేందుకు వచ్చారంట. 

6 /6

అప్పుడు శ్రీదేవీ షూటింగ్స్ లలో కఠినంగా పాటించే డైట్ ల గురించి కూడా చెప్పారంట.  పలు మార్లు షూటింగ్ లో లొబీపీతో పడిపోయిన సందర్భాలు షేర్ చేసుకున్నారంట. తాజాగా,బోణీ కపూర్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి శ్రీదేవీ మరణం వెనుక గల కారణాలు మళ్లీ వార్తలలో నిలిచినట్లు తెలుస్తొంది.