Kamadhenu Idol Where To Placed In The House: హిందూ గ్రంథాల్లో.. చరిత్రలో కామధేనుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. కామ ధేనువుగా దేవతా స్వరూపంగా భావిస్తారు. ఆవుతోపాటు చిన్న దూడ పాలు తాగుతున్న విగ్రహాన్ని కామధేను విగ్రహంగా పిలుస్తారు. ఈ విగ్రహం మీ ఇంట్లో ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఏ దిశలో.. ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి.
గ్రంథాలు: మంధర పర్వతాన్ని ఉపయోగించి ఆదిశేషుని మద్దతుతో దేవతలు, రాక్షసులతో క్షీరసాగర మథనం నుంచి కామధేనుడు బయటకు వచ్చాడని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.
కోరికలు తీర్చే ఆవు: కామధేనువు అంటే కోరికలు తీర్చే ఆవుగా భావిస్తారు. కామధేనువు ఇంట్లో ఉన్నవారికి దేనికీ లోటు ఉండదని విశ్వాసం. అసురులు కామధేనుని తమ వద్ద ఉంచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించగా.. దేవతలు పవిత్రమైన కామధేనువును తమ వద్ద ఉండేలా పోరాడారని పురాణ ఇతిహాసాల్లో ఉంది.
దేవతా స్వరూపం: కామధేనువును దేవతా స్వరూపంగా కొలుస్తారు. కామధేనుడి విగ్రహం స్వచ్ఛత, సానుకూల శక్తి కలిగి ఉంటుంది. ఆవుతో పాటు చిన్న దూడ పాలు తాగుతున్న విగ్రహం ఇంట్లో ఉంటే ఆనందం, సమృద్ధి ఇంట్లో ఉంటుందని నమ్ముతారు.
దేవతలు కొలువై: గో మాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే హిందువులు ఆవును అత్యంత పవిత్రమైన జంతువుగా పూజిస్తారు. దేవత రూపంలో కొలుస్తూ పూజిస్తుంటారు.
చెడు శక్తులు దూరం: కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటుచేసుకోవడం ద్వారా అన్ని విధాలా సానుకూలంగా ఉంటుంది. చెడు శక్తులు దూరమవుతాయని నమ్మకం. కామధేనుడు ధనాన్ని ఆకర్షిస్తాడని ఈ విగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం.
చెడు గుణాలు: కామధేనువు విగ్రహం బయటి నుంచి ఇంట్లోకి డబ్బును ఆకర్షించడంతోపాటు చెడు గుణాలు ఉన్నవారిని ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ కారణంగా ఇంట్లో కామధేనుడి విగ్రహాన్ని ఉండేలా చూసుకుంటారు.
ఈ దిశలో: ఇంట్లో కామధేను విగ్రహాన్ని ఎటు వైపు ఏర్పాటుచేయాలనే సందేహాలు ఉంటాయి. ఇంటికి ఉత్తరం, ఈశాన్య లేదా తూర్పు దిశలో కామధేనువు విగ్రహం ఉంచాలి. దేవుడి గది లేదా ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర కామధేనువు విగ్రహాన్ని ఉంచవచ్చు.
ఈ లోహలతో: కామధేనువు విగ్రహాన్ని వెండి, ఇత్తడి లేదా రాగి లోహంతో తయారు చేయాలి. ఈ విగ్రహం ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు, శాంతి, విజయాన్ని ఇస్తుందని హిందూవులు విశ్వసిస్తారు.
గమనిక: ఈ కథనం మతపరమైన సమాచారంపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు.