Chandrababu Pawan Meet: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ భేటీ.. త్వరలో కీలక పరిణామాలు?

Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.

1 /6

కీలక భేటీ: దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమావేశం కావడం కీలక అంశంగా మారింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానికి సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ  సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు.

2 /6

కీలక అంశాలు: దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన సమావేశంలో సీఎం, డిప్యూటీ సీఎం కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.

3 /6

ఆసక్తికర చర్చ: ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మధ్య చర్చ జరిగిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

4 /6

బియ్యం రవాణా: ఈ సందర్భంగా కాకినాడ పోర్ట్ అక్రమ రేషన్ బియ్యం సరఫరాపై  సీఎం చంద్రబాబు దృష్టికి డిప్యూటీ సీఎం తీసుకువెళ్లారని సమాచారం.

5 /6

డిప్యూటీ సీఎం వివరణ: తాజా రాజకీయ అంశాలు, ఢిల్లీ పర్యటన విషయాలు కూడా చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ వివరించారని తెలుస్తోంది.

6 /6

పదవులపై: ఇదే క్రమంలో ఈ సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పదవుల భర్తీపై ఇరు నాయకుల మధ్య చర్చ జరిగినట్లు కూటమి వర్గాలు వెల్లడించాయి.