Telangana New Scheme Details: 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం దృష్టి పెట్టబోతోంది. ఇందులో భాగంగా కొత్త పథకాలను అమలు చేయబోతున్నట్లు అధికార సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భాగంగా వచ్చే ఏడాదిలో మహిళలకు అనేక పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకే ఇప్పటికే చాలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
తెలంగాణాలోని ప్రతి మహిళలకు తమ జీవన ప్రమాణాన్ని పెంచేందుకే ఈ కొత్త ప్రథకాలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే స్త్రీలకు త్వరలోనే అందుబాటులోకి రాబోయే పథకాలేంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
తెలంగాణ సర్కార్ త్వరలోనే మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం పథకాన్ని కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు పథకాలు అమలైతే.. మహిళలకు ఆర్థికంగా కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వారు కుటుంబానికి కూడా అండగా నిలుస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర సర్కార్ ఈ పథకాలను అమలు చేయబోతోంది.
కొత్త సంవత్సరంలో మహాలక్ష్మి పథకం అమలైతే తెలంగాణలో ఉన్న ప్రతి మహిళ ఖాతాలో నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందుతుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన బీమా పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వచ్చే సంవత్సరంలో తులం బంగారం పథకం కూడా అమలు కాబోతోంది. దీని వల్ల కొత్తగా పెళ్లి అయిత ఆడపడుచులకు తులం బంగారం అందించనుంది. అలాగే దీంతో పాటు ఆర్థిక భరోసా కూడా లభించనుంది.