Telangana Liquor: మందు బాబులకుతెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇది చూసి మందు బాబులకు తాగక ముందే మత్తెక్కిస్తోంది. ఇంతకీ వివరాల్లోకి వెళితే..
అటు గృహజ్యోతి పథకం కింద విడతల వారీగా దాదాపు కోటి ఇళ్లకు జీరో బిల్లు ఇష్యూ చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మరోవైపు రైతు రుణ మాఫీని విడతల వారీగా చేస్తోంది.
మరోవైపు గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఇచ్చిన నగదు ప్రోత్సహాకాన్ని రైతు భరోసా కింద జనవరి నుంచి ఇవ్వనున్నట్టు చెప్పింది. ఇందులో 10 ఎకరాలకు లిమిట్ పెడతామనుకున్నారు. కానీ ప్రస్తుతం మాత్రం గత ప్రభుత్వం మాదిరే యథాతధంగా రైతు భరోసా పైసలు ఇవ్వనున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు చెప్పాయి. ధరలు పెంచాలని బేవరేజేస్ కంపెనీ వాళ్లతో పాటు మద్యం ధరల పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినా.. ప్రభుత్వం మాత్రం మందుబాబులను సంతోష పెట్టడానికి ధరల పెంపు ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలుస్తుంది.
రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. రీసెంట్ గా బీర్ల ధరలను రూ. 20 చెప్పునా.. ఇతర లిక్కర్ ధరలను రూ.30 నుంచి రూ. 40 వరకు చొప్పున పెంచాలని కమీటీ సిఫార్స్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.