Lucky Stone: రత్నశాస్త్రం ప్రకారం కొన్ని రత్నాలను ధరించడం వల్ల జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు, డబ్బు లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే చాలామంది రంగు రత్నాలను ధరిస్తూ ఉంటారు. రత్న శాస్త్రంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగురత్నం అంకితం చేశారు. రత్న శాస్త్రం ప్రకారం పుష్యరాగాన్ని బృహస్పతి గ్రహానికి అంకితం చేశారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు.
పుష్యరాగం రత్నం ధరించడం వల్ల ఉద్యోగాలు లేనివారికి.. ఉద్యోగాలు లభించడమే కాకుండా.. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రత్న శాస్త్రంలో తెలిపారు. అంతేకాకుండా అభివృద్ధిలో భాగంగా ఎలాంటి మార్గాలు వచ్చిన తొలగిపోతాయి.
అలాగే ఈ రత్నాన్ని ధరించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు కూడా కలుగుతాయని రత్నశాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాపారాల్లో తీవ్రమైన నష్టాలు వస్తున్న వారు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ రత్నాన్ని ధరించడం వల్ల వ్యాపారంలో పురోగతి లభించి భారీ మొత్తంలో లాభాలు కలుగుతాయి.
బృహస్పతి జాతకంలో ఆ శుభస్థానంలో ఉన్నవారు పుష్యరాగం రత్నం ధరించడం ఎంతో మంచిదట. ఇలా చేయడం వల్ల ప్రతి పనిలో అఖండ విజయాలు కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే బృహస్పతి అనుగ్రహం కూడా లభించి ముందు భవిష్యత్తు రోజుల్లో తీపి కబురులు కూడా వింటారు.
పుష్యరాగం రత్నం, పచ్చలను కలిపి ధరించడం వల్ల మరెన్నో లాభాలు కలుగుతాయని రత్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలా రెండు కలిపి ధరించడం వల్ల బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందట. అలాగే చిరకాల కోరికలు కూడా నెరవేరుతాయి.
ముఖ్యంగా ఈ రెండు రత్నాలను గృహస్పతి అశుభ స్థానంలో ఉన్నవారు ధరించడం వల్ల ఎలాంటి నష్టాలైనా జరగకుండా ఉంటాయట. అలాగే పూర్వికులు ఆస్తి కూడా లభిస్తుందని శాస్త్రంలో పేర్కొన్నారు. దీంతోపాటు జీవితంలో ఎప్పుడూ పొందని జాక్పాట్ కూడా కొడతారు..