Sreeleela: బ్లాక్ డ్రెస్ లో కిస్సిక్ పాప కసక్ అందాలు.. గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్న శ్రీలీల..


Sreeleela: శ్రీలీల తెలుగులో బుల్లెట్ వేగంతో వచ్చిన రాకెట్ వేగంతో దూసుకుపోతుంది శ్రీలీల. అంతేకాదు తెలుగులో వరుస ఛాన్సులతో తెగ అలరిస్తోంది. తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2లో కిస్సీక్ సాంగ్ తో మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పాటలో శ్రీలీల డాన్సలకు అభిమానులు ఫిదా అయ్యారు.

1 /6

Sreeleela: ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ తో చేసిన శ్రీలీల డాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అంతేకాదు ఈ సినిమాలో ఐటెం పాటతో ప్యాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. మొత్తంగా నార్త్, సౌత్ తేడా లేకుండా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది.

2 /6

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకులను మెప్పించింది. శ్రీలీల.. హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ తెలుగు చిత్రంతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. ప్రస్తుతం తెలుగులో వరుస ఛాన్సులతో  క్రేజీ భామగా  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

3 /6

తక్కువ సమయంలోనే అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. ప్రస్తుతం సినిమాలతో పాటు MBBS చేస్తోంది. వచ్చే యేడాది ఈమె డాక్టర్ కంప్లీటయ్యే అవకాశాలున్నాయి.స్వతహాగా తెలుగు భామ అయిన ఆమె బెంగళూరులో పుట్టి పెరిగింది. అక్కడ కన్నడలో వచ్చిన 'కిస్' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది.

4 /6

శ్రీలీల ఈ సంవత్సరం ‘గుంటూరు కారం’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది. త్వరలో  పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంతో పాటు.. రవితేజతో చేస్తోన్న మూవీపై శ్రీలీల భారీగా ఆశలు పెట్టుకుంది. తాజాగా పుష్ప 2లో ఐటెం సాంగ్ తో శ్రీలీలకు తన కెరీర్ లో తొలి ఐటెం సాంగ్ చేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీలకు హిందీలో వరుస ఛాన్సులు పలకరించడం పక్కా అని చెప్పొచ్చు.

5 /6

శ్రీలీల నటిగానే కాకుండా.. తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో  నిలిచింది. ఇక మాస్ మహారాజ్ రవితేజతో చేసిన 'ధమాకా'తో మూవీతో శ్రీలీలకు స్టార్ డమ్ వచ్చింది.

6 /6

లాస్ట్ ఇయర్..  శ్రీలీల స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' చిత్రాలతో పలకరించింది. ఇందులో బాలయ్య కూతురు పాత్రలో నటించిన 'భగవంత్ కేసరి' సినిమా మాత్రమే సూపర్ హిట్‌గా నిలిచింది. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కౌట్ కాలేదు.