Gold Rate Today: నేడు భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై 6వేలు తగ్గింపు..ఇంకో నెల ఓపిక పడితే 30వేలకే తులం

Gold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది. బంగారం ధర తగ్గుదలకు దారి తీసిన పరిణామాలు ఏంటో చూద్దాం 
 

1 /6

Gold Rate Today: బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం ధఱలు గతంలో 84వేల వరకు చేరింది. దీంతో ఆల్ టైం రికార్డు నమోదు చేసింది.

2 /6

ప్రస్తుతం బంగారం ధర 78వేలు ఉంది. అంటే 84వేల నుంచి 78వేలకు దిగి వచ్చిందంటే దాదాపు రూ. 6000వేలు తగ్గింది. తులంపై 6వేల రూపాయలు తగ్గినట్లే అని చెప్పవచ్చు. 

3 /6

అయితే బంగారం ధరలు ప్రధానంగా తగ్గడానికి ఎక్కువగా అమెరికాలో డాలర్ ధర భారీగా బలపడటమే ఒక కారణంగా చెప్పవచ్చు. బంగారం ధరను డాలర్ ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్న సంగతి తెలిసిందే. 

4 /6

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి చివరి వారంలో పదవి బాధ్యతలు చేపడుతారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా బాండ్లు కొనుగోలు చేయడంతోపాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి బంగారం నుంచి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. 

5 /6

బంగారం ధరలు ప్రత్యేకంగా ఫిబ్రవరి నుంచి తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక ఆర్థిక విధానం అమల్లోకి తీసుకురాన్నున్నారు. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వైపు తరలించే ఛాన్స్ ఉంది. దీంతో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.   

6 /6

బంగారం ధరలు ఈ ఏడాది భారీగా హెచ్చుతగ్గుదలకు గురవుతున్నాయని. ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 65వేల రూపాయల సమీపంలో ఉన్న బంగారం ధర ఒక దశలో 84వేల రూపాయలకు పెరిగింది. ఈ ఏడాది చివరి నాటికి అంటే డిసెంబర్ నెలలో 7వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది.