Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి తెలుగు ఆడియన్స్ కు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. నిధి నటన కన్నా.. తన స్కిన్ షోతోనే ఎక్కువగా పాపులారిరటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ది రాజా సాబ్’ సినిమాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలు తన కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలవడం పక్కా అని చెబుతోంది.
నిధి అగర్వాల్.. ప్రస్తుతం రెబెల్ స్టార్ ప్రభాస్ తో ‘ది రాజా సాబ్’, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ వంటి ప్రెస్టీజియస్ చిత్రాల్లో నటిస్తోంది.
అంతేకాదు రీసెంట్ గా ఈమె సామాజిక మాధ్యమాల నేపథ్యంలో పలువరు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు అంతే ఆసక్తిగా సమాధానాల ఇచ్చింది.
‘ది రాజా సాబ్’ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి ఎంతో సరదాగా పనిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మూవీ టీమ్ లో ఎంతో డెడికేషన్ ఉందన్న ప్రస్తావించింది నిధి అగర్వాల్.
ఇక పవన్ కల్యాణ్ తో రీసెంట్ గా ఓ సెల్ఫీ తీసుకున్నా విషయాన్ని ప్రస్తావించింది. త్వరలోనే ఆ సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానని నిధి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.
తెలుగులో వరుస సినిమాలు చేయడంతో తెలుగు బాగా మాట్లాడటం నేర్చుకున్న విషయాన్ని ప్రస్తావించింది. కేవలం అందరికీ నమస్కారం అనే బ్యాచ్ కాదని ఫన్నీగా సమాధానం చెప్పింది.
వచ్చే యేడాది బ్యాక్ టూ బ్యాక్ తన రెండు మూవీస్ ‘ది రాజా సాబ్’, ‘హరి హర వీరమల్లు’ విడుదల అవుతాయని, ఆ రెండు చిత్రాలతో నాయికగా ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాననే ఆశాభావం వ్యక్తం చేసింది నిధి అగర్వాల్. ఈ రెండు చిత్రాలతో పాటు మరో సర్ ప్రైజింగ్ మూవీ కూడా ఉందని తెలిపింది.
నిధి అగర్వాల్ .. బాలీవుడ్ మూవీ మున్నా మైఖేల్ సినిమాతో పరిచయమైంది. తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలతో అదరగొడుతోంది.