Sobhita Nagachaitanya: శ్రీ శైలం మల్లన్న భ్రమరాంబ అమ్మవారి సేవలో శోభిత, చైతు.. పిక్స్ వైరల్..

Akkineni Nagarjuna at srisailam: అక్కినేని నాగార్జున కుటుంబం శ్రీ శైలం, భ్రమరాంబ మల్లీ కార్జున స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఆలయ అధికారులు అక్కినేని కుటుంబానికి ఘనంగా స్వాగతం పలికారు.

1 /7

చైతు, శొభితల పెళ్లి వేడుకగా జరిగిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. వీరి పెళ్లి మాత్రం.. సంప్రదాయ బద్దంగా ఘనంగా జరిగింది. అదే విధంగా వీరి పెళ్లి దాదాపు.. 8 గంటల పాటు జరిగినట్లు తెలుస్తొంది.

2 /7

వీరి పెళ్లిఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేశారు. మరోవైపు కొత్త జంటను నెట్టింట స్పెషల్ గా విష్ చేశారు. అదే విధంగా ప్రస్తుతం నాగార్జున సైతం.. తన కోడుకు, కోడలి పెళ్లి సంబంధించిన పిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లలో షేర్ చేశారు.

3 /7

ఈ క్రమంలో తాజాగా, కొత్త జంట.. శ్రీ శైలం భ్రమరాంబ, మల్లీకార్జున  స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. ఆలయ అధికారులు, పండితులు అక్కినేని కుటుంబానికి స్పెషల్ గా స్వాగతం పలికారు .

4 /7

చైతు,శోభితలు, నాగార్జునలు శ్రీశైలం ఆలయం దర్శించుకున్నట్లు తెలుస్తొంది. పండితులు వీరిచేత ప్రత్యేకంగా పూజలు చేయించారు. అంతే కాకుండా.. శోభిత పసుపు రంగు చీర, చైతు తెల్లని పట్టు షేర్వాణి వేసుకున్నట్లు తెలుస్తొంది. 

5 /7

చైతు, నాగార్జున, శోభితలు అక్కడ శ్రీశైలం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ కాసేపు సందడి చేసినట్లు తెలుస్తొంది.  అక్కడున్న భక్తులు మాత్రం.. చైతు, శోభితను చూసి ఫుల్ ఖుష్ అయ్యారంట. ప్రస్తుతం వీరు శ్రీ శైలంకు స్వామి వార్లను దర్శించుకున్న పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

6 /7

స్వామివారిని దర్శించుకున్నాక.. ఆలయ అధికారులు, పండితులు.. అక్కినేని కుటుంబానికి.. భ్రమరాంబ సహిత మల్లన్న స్వామివారి తీర్థ, ప్రసాదాలు అందజేసి, ప్రత్యేకంగా స్వామి వారి వేదాశీర్వచం అందజేసి, స్వామి వారి శేష వస్త్రం చేత గౌరవించినట్లు తెలుస్తొంది.

7 /7

ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబంమాత్రం.. ఎంతో సంతోషంతో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. వీరు శ్రీశైలం నుంచి నేరుగా తిరుపతికి వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి.దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.