అమరావతి: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ మధ్య సయోధ్య నెలకొందని, వైసీపీ నేతలకు కేంద్రమంత్రి పదవులు ఇవ్వనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్ స్పష్టతనిచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీతో కానీ, టీడీపీతో కానీ ఎలాంటి పొత్తు లేదని వెల్లడించారు. బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటోందన్నదన్న ప్రచారం మాత్రమేనని అన్నారు. ఈ విషయంలో అనేక రకాల చర్చలు, ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను కలిసిన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం వైసీపీ ఎన్డీయేలో చేరుతున్నట్టు ప్రచారం మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా, మరే ఇతర ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నా.. ఎన్డీయే వైఖరిలో మార్పుండదని ఆయన స్పష్టం చేశారు. అన్నీ రాష్ట్రాలను సమభావంతోనే చూస్తామని, అందరినీ సమదృష్టితో చూడడమే ప్రధాని మోదీ సిద్ధాంతమని అన్నారు. ఏపీలో బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉందని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ, విపక్షంగా ఉన్న టీడీపీ మాకు రాజకీయ ప్రత్యర్థులే తప్ప మరొకటి కాదని ఆయన స్పష్టం చేశారు.
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
వైసీపీని ఎన్డీఏలో చేరమని ఆహ్వానించారా?