Horoscope 2025: ఈ ఐదు రాశుల వారు 2025 లో సొంటిల్లు కట్టుకోవడం ఖాయం..!

House Construction predictions in 2025: 2024 చివరి నెల వచ్చేసింది.ఈ డిసెంబర్ ప్రారంభంలో శుక్రుడు తన రాశిని మార్చుకున్నాడు.అంటే మకర రాశిలోకి ప్రవేశించాడు.దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.అయితే కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ రాశి వారికి 2025 లో గృహ నిర్మాణం బాగా కలిసి వస్తుందో చూద్దాం.

1 /5

శని ఒక రాశిలో ఎక్కువ కాలం ఉండే గ్రహం. దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటాడు. శని మార్పు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావం చూపిస్తుంది. 2025 మార్చి వరకు శని కుంభరాశిలోనే ఉంటాడు. మీనరాశిలోకి 25 మార్చి 2025న ప్రవేశిస్తాడు. మరి ఈ సమయంలో 2025 లో ఏ రాశి వారికి గృహం నిర్మించే అవకాశం ఎక్కువగా ఉందో చూద్దాం..

2 /5

ఈ రాశి వారికి ఇల్లు కొనడానికి లేదా కట్టడానికి 2025 మంచి సమయం. 2025 ఓ మోస్తరుగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఇప్పటికే కొంత భూమిని కలిగి ఉంటే, దానిపై మీ ఇంటిని నిర్మించాలనుకుంటే ఇది మీకు మంచి అవకాశం. ఇంటి నిర్మాణం విషయంలో మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

3 /5

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభంలో అంటే జనవరి నుండి మార్చి వరకు శని ప్రభావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శనిదేవుడు మీకు ఇల్లు, ఆస్తి పరంగా సమస్యల రావచ్చు. అందువల్ల, మీరు ఈ సంవత్సరం ఏదైనా భూమిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే, దానిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మంచిది. వివాదాస్పద భూమిని కొనుగోలు చేయడం మీ సమస్యలను పెంచుతుంది.   

4 /5

మిథున రాశి వారికి 2025 ఏడాది ఇల్లు కొనుగోలు చేసే విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో, అంటే జనవరి నుండి మే వరకు మీపై రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మీరు భూమి లేదా ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శని మీకు మే నెల తరువాత సానుకూల ఫలితాలను ఇస్తుంది.

5 /5

ఈ రాశి వారికి 2025 లో సొంతింటి కల తప్పకుండా నెరవేరుతుంది. ఈ సంవత్సరం కొత్త ఇల్లు కొనడానికి లేదా భూమికి సంబంధించిన విషయాలకు మీకు బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు స్థలాన్ని లేదా ఇంటిని సొంతం చేసుకోవాలనుకుంటే మీ మార్గంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే మీ కృషి, కర్మను బట్టి ఫలితాలు ఉంటాయి. మీరు భూమిని కొనుగోలు చేయాలనుకున్నా లేదా ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే మే నెల మధ్యలో వచ్చే సమయం శుభప్రదం.