Keerthy suresh latest pics: కీర్తిసురేష్ రెడ్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇంత తొందరగా.. ఇదేంటని కూడా కొందరు నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారంట. ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
నటి కీర్తీ సురేష్ ఇటీవల తన చిన్న నాటి ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి గోవాలో ఎంతో గ్రాండ్ గా జరిగింది. తొలుత హిందు సంప్రదాయం ప్రకారం జరగ్గా, మరల క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగింది.
కీర్తిసురేష్ తన చిన్న నాటి బాయ్ ఫ్రెండ్ తో కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లు గతంలో పలుమార్లు ప్రచారం జరిగింది. అదే విధంగా దీనిపై ప్రస్తుతం క్లారిటీ ఇచ్చే విధంగా ఆంటోని అంటే తనకు ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాము ప్రేమించుకుంటున్నట్లు మహానటి చెప్పింది.
మరొవైపు కీర్తీసురేష్ పెళ్లి జరిగి కనీసం రెండు రోజులు కూడా కాక ముందే ఆమె బైటకు ఒక మూవీ ప్రమోషన్ లో కన్పించి హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. మెడలో మంగళ సూత్రం ధరించి తెగ రచ్చ చేసినట్లు సమాచారం.
కీర్తీ సురేష్ ప్రస్తుతం బేబీ జాన్ అనే మూవీలో నటించారు. ఈ సినిమా.. డిసెంబరు 25న అభిమానుల ముందుకు రానున్నట్లు తెలుస్తొంది.ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగానే.. మహానటి..ఈ విధంగా బైటకు వచ్చినట్లు తెలుస్తొంది.
కీర్తి సురేష్ పెళ్లైన కూడా.. ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా రెడ్ కలర్ మోడ్రన్ దుస్తుల్లో కన్పించి హల్ చల్ చేస్తున్నారు. బేబీ జాన్ మూవీతో కీర్తీ సురేష్ హిందిలో తొలిసారి అడుగు పెడుతున్నట్లు తెలుస్తొంది. ఈ మూవీ ఆడియన్స్ కు ఎంతో నచ్చుతుందని కీర్తీ సురేష్ అన్నట్లు తెలుస్తొంది.
ప్రస్తుతం కీర్తీ సురేష్ రెడ్ కలర్ , గ్రెకలర్ మోడ్రన్ దుస్తులతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అదే విధంగా మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత.. కొన్నిరోజులైన గ్యాప్ తీసుకోకుండా కీర్తీసురేష్ బైటకు రావడం పట్ల నెటిజన్లు మాత్రం వెరైటీగా కామెంట్లు చేస్తున్నారంట.