Health Remedies: బెల్లంతో ఈ పదార్ధం కలిపి రోజూ సేవిస్తే ఈ 5 అనారోగ్య సమస్యలకు చెక్

ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ పదార్ధాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అలాంటి పదార్ధాల్లో ముఖ్యమైనవి బెల్లం, నెయ్యి. ఈ రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఈ రెండూ కలిపితే మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

Health Remedies: ప్రకృతిలో లభించే ఎన్నో రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ పదార్ధాలకు విశేష ప్రాధాన్యత ఉంది. అలాంటి పదార్ధాల్లో ముఖ్యమైనవి బెల్లం, నెయ్యి. ఈ రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరమే. ఈ రెండూ కలిపితే మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ రెండూ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.
 

1 /5

ఎముకలు బలోపేతం బెల్లం నెయ్యిలో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. ఎముకలు కీళ్లను స్ట్రాంగ్ చేస్తుంది. క్రాంప్స్ తగ్గిస్తుంది. 

2 /5

మూడ్ స్వింగ్ ఒత్తిడితో లేదా మూడ్ స్వింగ్ ఉన్నవారికి బెల్లం నెయ్యి మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండూ కలిపి సేవిస్తే ఇందులోని యాంటీ డిప్రెసెంట్ గుణాలు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయి.

3 /5

రక్త శుద్ధి బెల్లం నెయ్యి మిశ్రం శరీరాన్ని డీటాక్స్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. విష పదార్ధాలను బయటకు తొలగిస్తుంది. దాంతోపాటు చర్మంపై నిగారింపును తీసుకొస్తుంది. మొటిమలు తొలగిపోతాయి.

4 /5

ఇమ్యూనిటీ బూస్టర్ బెల్లం నెయ్యిలో విటమిన్ ఇ, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పటిష్టం చేస్తాయి. రోజూ తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉత్పన్నం కావు.

5 /5

జీర్ణక్రియ  బెల్లం నెయ్యి కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మరింతగా మెరుగుపడుతుంది. బెల్లంలో ఉండే ఫైబర్, నెయ్యిలో  ఉండే ల్యాక్సేటివ్ గుణాలు మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్గిస్తాయి. భోజనం తరువాత బెల్లం లేదా కొద్దిగా నెయ్యి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది