Indigo: న్యూ ఇయర్ వేళ ఇండిగో బంపర్ ఆఫర్ ..రైలు స్లీపర్ ఛార్జీ కంటే తక్కువ ధర ఫ్లైట్ టికెట్


Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో న్యూఇయర్ స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు తక్కువ ధరల్లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ ఆఫర్ ద్వారా అందిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /8

Tickets Price Cut: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక గెట్ ఆవే సేల్ ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరలకే టికెట్లు అందిస్తామని ప్రకటనలో వెల్లడించింది. దేశంలోని బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో ప్రయాణికుల కోసం గొప్ప ఆఫర్‌ను అందించింది.

2 /8

ఇండిగో అందించే ప్రత్యేకమైన 'గెట్‌వే సేల్‌'లో దేశీయ, అంతర్జాతీయ రూట్‌ల టిక్కెట్‌లను చాలా చౌక ధరలకు ప్రయాణికులకు అందిస్తున్నారు. ఇండిగో  ప్రకటించిన ఈ సేల్ డిసెంబర్ 25, 2024 వరకు కొనసాగుతుంది.  

3 /8

మీరు డిసెంబర్ 25 వరకు ఇండిగో టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే, మీరు ఈ టికెట్ ద్వారా 2025 జనవరి 23 నుండి ఏప్రిల్ 30 వరకు ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.

4 /8

సేల్ కింద, దేశంలోనే అంటే దేశీయ రూట్లలో టికెట్ ధర రూ.1,199 నుంచి, అంతర్జాతీయ రూట్లలో విదేశాలకు వెళ్లేందుకు రూ.4,499 నుంచి ప్రారంభమవుతుంది. చౌక టిక్కెట్లు కాకుండా, ఇండిగో కొన్ని అదనపు సేవలపై 15శాతం తగ్గింపును కూడా అందిస్తోంది.  

5 /8

ప్రీ-పెయిడ్ అదనపు లగేజీ (15 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలకు) కాకుండా సీట్ ఎంపిక టారిఫ్‌లు, ఎమర్జెన్సీ లార్జ్ సీట్ (XL) సెలెక్ట్ టారిఫ్‌లు చేర్చారు. ఈ సదుపాయం కోసం, దేశీయ రూట్లలో ఛార్జీ రూ.599 నుండి మొదలవుతుంది.

6 /8

అంతర్జాతీయ రూట్లలో ఈ ఛార్జీ రూ.699 నుండి ప్రారంభమవుతుంది. ఇండిగో ఇస్తున్న రాయితీల ఆధారంగా ఇండిగో చౌకగా రైలు టిక్కెట్లను అందజేస్తోందని చెప్పవచ్చు.  

7 /8

ఇండిగో మరో డిస్కౌంట్ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది . మీరు ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఇండిగో విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటే, మీకు అదనపు తగ్గింపు లభిస్తుంది.

8 /8

దేశీయ రూట్లలో ఈ తగ్గింపు 15శాతం అంతర్జాతీయ రూట్లలో ఈ తగ్గింపు 10శాతం వరకు ఉంది. అయితే దీని కోసం డిసెంబర్ 31లోగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. టిక్కెట్‌ను బుక్ చేసుకోవడానికి, మీరు ఇండిగో వెబ్‌సైట్ లేదా యాప్‌ని సందర్శించడం ద్వారా బుక్ చేసుకోవాలి.