Top Unsafe Cars In India: NCAP కార్ క్రాష్‌ రేటింగ్‌ సంచలన నిజాలు.. ఈ కార్లు అస్సలు సేఫ్‌ కాదు!

Top Unsafe Cars In India In Telugu: ప్రస్తుతం చాలా మంది సెఫ్టీ కార్లలో ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే అందరూ NCAP కార్ క్రాష్ టెస్టుల్లో మంచి రేటింగ్ పొందిన కార్లనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే దీనిని దృష్టిలో పెట్టుకుని ఆటో మొబైల్‌ కంపెనీలు కూడా ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్స్‌తో కొత్త కొత్త కార్లను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నాయి. 
 

1 /6

భారతదేశంలో గత 2022 సంవత్సరం నుంచే గ్లోబల్ NCAP కారుకు భద్రత రేటింగ్ అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా కార్ క్రాష్ పరీక్ష అనంతం మాత్రమే రేటింగ్‌ పొందుతుంది. అయితే ఇటీవలే గ్లోబల్ NCAP కార్ క్రాష్ పరీక్షలో మేడ్ ఇన్ ఇండియా కార్లకు గ్లోబల్ ఎన్‌సిఎపి సేఫ్టీ రేటింగ్ అందించింది. ఇందులో పూర్ రేటింగ్‌ పొందిన కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

2 /6

గ్లోబల్ NCAP కార్ క్రాష్ టెస్టింగ్‌లో భాగంగా భారత్‌లో తయారైన కొన్ని కార్లు పూర్‌ రేటింగ్‌ పొందాయి. ఇందులో కొన్ని కార్లైతే గ్లోబల్ NCAP రేటింగ్‌లో భాగంగా ఏకంగా 0 నుంచి 1-స్టార్ రేటింగ్‌లను పొందినట్లు సమాచారం.     

3 /6

మారుతీ సుజుకి తయారు చేసిన  ఎస్ ప్రెస్సో కారుపై క్రాష్‌ టెస్టింగ్‌ జరిపారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన నిజాలు తెలిశాయి. ఈ కారుకు సేఫ్టీ రేటింగ్ కూడా లేదని తెలింది. ఈ రేటింగ్‌లో భాగంగా ఒకే స్టార్‌ పొందినట్లు తెలుస్తోంది. ఇక పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఈ కారు జీరో రేటింగ్‌ పొందినట్లు తెలుస్తోంది.   

4 /6

ఇక మారుతీ సుజుకి స్విఫ్ట్‌పై కూడా గతంలో క్రాష్ టెస్టింగ్‌ జరిపారు. ఇందులో భాగంగా వన్-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 60 నిండిన వారి ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో కూడా చాలా పూర్‌ రేటింగ్‌ పొందింది.  

5 /6

  మారుతీ వ్యాగన్ ఆర్‌ను కంపెనీ అద్భుతమైన డిజైన్‌తో విడుదల చేసింది. కానీ రక్షణ పరంగా ఈ కారు చాలా పూర్ అని ఇటీవలే క్రాష్‌ టెస్టింగ్‌లో తెలింది. భద్రత పరంగా ఈ కారు కేవలం ఒకే ఒక స్టార్‌ రేటింగ్‌ను పొందింది.     

6 /6

మారుతీ కంపెనీ గతంలో విడుదల చేసిన ఇగ్నిస్ కూడా రేటింగ్‌ పరంగా చాలా పూర్‌ అని చెప్పొచ్చు. ఇది NCAP స్టార్ రేటింగ్‌లో  జీరో స్టార్ రేటింగ్‌ను కలిగి ఉంది. చైల్డ్‌ రేటింగ్‌లో భాగంగా కేవలం 3.86 పాయింట్లను పొందింది.