Aratikaya bajji: చలికాలంలో వేడి వేడి పదార్థాలు తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అరటి కాయ బజ్జీలు తినేందుకు చాలా మంది ఇష్టపడుతారు. ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా చాలా మందికి సాయంత్రం అయ్యిందంటే చాలా ఏదో ఒకటి తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కొంత మంది బైటకు వెళ్లి తమకు నచ్చిన ఫుడ్ తింటుంటే, మరికొందరు మాత్రం.. ఇంట్లోనే రకరకాల టెస్టీ స్నాక్స్ చేసుకుంటారు.
అయితే.. ప్రస్తుతం అరటి కాయ బజ్జీలను సింపుల్ గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరటి కాయల్ని మార్కెట్ నుంచి తెచ్చుకుని క్లీన్ గా కడుక్కొని తొక్కలు తీసేయాలి. ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో రెడీగా పెట్టుకొవాలి.
మరో గిన్నెలో.. చెనగ పిండి వేయాలి. దానిలో పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి నీళ్లు వేసి బాగా మిక్స్ చేయాలి. వీటిలో మనం ఇంతకు ముందు రెడీగా పెట్టుకున్న అరటి కాయ ముక్కల్ని వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయిట్ చేయాలి.
ఆ తర్వాత గ్యాస్ మీద కడయ్ లో నూనె వేసి.. స్టౌవ్ మీద పెట్టాలి. నూనె మంచిగా వేడి అయ్యాక.. దానిలో మెల్లగా.. అరటి కాయపిండితో బాగా కల్పిన తర్వాత మెల్లగా జారవిడవాలి. అప్పుడు.. నూనెలో అరటి కాయలు ఉబ్బుతూ పైకి వస్తాయి
అరటి కాయల్ని.. బాగా ఎర్రగా అయ్యే వరకు.. నూనెలో గోలించాలి. ఆ తర్వాత వెంటనే దాన్ని జాలీ గంటేతో తీసి మరో గిన్నెలో వేసుకొవాలి. ఇలా చేస్తే.. టెస్టీ టెస్టీ అరటి కాయ బజ్జీలను ఇట్టే రెడీ చేసుకొవచ్చు. ఈ బజ్జీలపై ఆనీయన్స్, మసాలా పొడి వేసుకుని తింటే మాత్రం భలే ఉంటుంది.