New Year Good News: న్యూ ఇయర్ దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో మందుల బాబులకు భారీ శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సంవత్సరం ముందు ప్రతి ఏడాది డిసెంబర్ 31న గ్రాండ్ గా పార్టీలు నిర్వహిస్తారు. 12 గంటల వరకు సెలబ్రేషన్స్ చేసుకుంటూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఈ పార్టీల్లో ప్రధానంగా మద్యం ఏరులైపారక తప్పదు. అలాంటి మందు బాబులకు భారీ శుభవార్త చెప్పింది ప్రభుత్వం.
మందు బాబులకు బంపర్ ఆఫర్ శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 31న సెలబ్రేషన్ చేసుకునే మందుబాబులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి రాత్రి 12 గంటలు దాటే వరకు సెలబ్రేషన్స్ పార్టీలు నిర్వహించుకుంటారు.
న్యూ ఇయర్ పార్టీలు నిర్వహించుకోవడానికి బార్లు, రెస్టారెంట్లు ఈవెంట్లతో కిక్కిరిసిపోతాయి. రాత్రి 12 అవ్వగానే పటాకులు మోతతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. మూడు రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం కానుంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మందు బాబులకు భారీ శుభవార్త చెప్పింది. ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అనే చెప్పవచ్చు.
ఈనెల 31న వైన్ షాప్ లు అర్థరాత్రి 12 వరకు బార్లు, రెస్టారెంట్లు ఈవెంట్లు ఒంటిగంట వరకు పర్మిషన్లను పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే జిహెచ్ఎంసి పరిధిలో ఈవెంట్లు పార్టీలపై ప్రత్యేక నిఘా ఉంచింది.
ఈ వేడుకల్లో డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి అధికారులకు పలు సూచనలు కూడా ఇచ్చింది. అంతే కాదు న్యూ ఇయర్ ఈవెంట్స్ నిర్వహించే వారికి ముందుగానే అనుమతులు తీసుకోవాల్సిందిగా పోలీసులు ఆదేశించారు. పార్టీలో మైనారిటీలకు ఎలాంటి అనుమతి లేదు లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిందే అని ప్రకటించింది.
డిసెంబర్ 31వ తేదీన ఇండోర్ పార్టీలు నిర్వహించే ఈవెంట్స్ సౌండ్ బాక్సులు 45 డేసిబెల్స్ కి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశంలో అసభ్యకర డాన్సులు కుదరవని చెప్పింది.
నిబంధనలను అతిక్రమించి డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా పట్టుపడితే భారీ జరిమానా విధిస్తారు. అది కాకుండా పదివేల ఫైన్ తో పాటు ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించనున్నట్లు ఇటీవలే తెలంగాణ పోలీసులు ప్రకటించారు..