Nara Brahmani: బడా డైరెక్టర్ ఆఫర్ కి నో చెప్పిన బాలయ్య కూతురు.. కారణం..?

Nara Brahmani Rejected Movies: నటసింహ నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి..అందం విషయంలో..హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు అన్న విషయం తెలిసిందే. అయితే బ్రహ్మీనికి కూడా…ఎన్నో రోజుల క్రితమే..హీరోయిన్గా అవకాశం వచ్చిందట. కానీ ఆ అవకాశాన్ని.. సున్నితంగా ఆమె తిరస్కరించినట్లు సమాచారం. ఇక ఈ విషయాన్ని స్వయంగా తన తండ్రి బాలకృష్ణనే ఒక షోలో తెలిపారు.

1 /5

నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో వేగంగా దూసుకెళ్తూనే.. పలు రకాల షోలకు హోస్ట్ గా.. కూడా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు పలు రకాల జ్యువెలరీ బ్రాండ్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆహా ఓటీటీ వేదికగా.. ప్రసారమయ్యేటువంటి అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను కూడా అప్పుడప్పుడు బయటపెడుతూ ఉన్నారు. 

2 /5

ఈ క్రమంలోనే బాలయ్య తన పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య బ్రాహ్మణి గురించి.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. అందులో భాగంగానే బ్రాహ్మణి   హీరోయిన్ ఎందుకు కాలేదు? అనే విషయం పై కూడా  బాలయ్య క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్-4 లో మాట్లాడుతూ.. తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది.

3 /5

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం తన కుమార్తె బ్రాహ్మణికి, ఒక చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా.. ఈ ఆఫర్  గురించి బాలకృష్ణ తన కూతురికి చెప్పారట. దీనికి ఆమె  మై ఫేస్ అని జవాబు ఇచ్చిందట. ఈ విషయం పైన ఆమె ప్రవర్తన చూసి చివరికి బాలయ్య.. ఈ ఆఫర్ ను కూడా తిరస్కరించారని తెలియజేశారు. అలా బాలయ్య కూతురుకి హీరోయిన్ గా మారే అవకాశాన్ని వచ్చినా కూడా తిరస్కరించిందని వెల్లడించారు.   

4 /5

ఇక అప్పటి నుంచి బ్రాహ్మణికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదని, కేవలం వ్యాపారాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయిందని తెలిపారు బాలయ్య. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని వివాహం చేసుకున్న తర్వాత బ్రాహ్మణి ఎక్కువగా బిజినెస్ వైపే అడుగులు వేసిందట. లోకేష్ కూడా ప్రస్తుతం ఏపీ విద్యా శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. 

5 /5

బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని.. బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్  కార్యక్రమానికి క్రియేటివ్ కన్సల్టెంట్ గా పనిచేస్తుంది. అంతేకాదు తన తమ్ముడు మోక్షజ్ఞ నటిస్తున్న మొదటి సినిమాకి నిర్మాతగా మారి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో.. బ్రాహ్మణి కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.