ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం దేశ ప్రజలకు ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజును పురస్కరించుకొని 'మిలాద్-ఉన్- నబీ' శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో ద్వారా ప్రజలకు మోదీ "మిలాద్-ఉన్- నబీ శుభాకాంక్షలు. మహమ్మద్ ప్రవక్త బోధనలు సమాజంలో ఐకమత్య స్ఫూర్తిని పెంచాయి" అని అన్నారు.
Greetings on Id-E-Milad. May the teachings of Prophet Mohammad further the spirit of harmony in our society. https://t.co/DpGJI8BZUN
— Narendra Modi (@narendramodi) December 2, 2017
మీలాద్ అనునది మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం. ఇది ఇస్లామీయ కేలండర్ లోని మూడవ నెల 'రబీఉల్-అవ్వల్' 12వ తేదీన వస్తుంది. చంద్రమానపు క్యాలెండర్ ఆధారంగా, 'మిలాద్-ఉన్- నబీ' తేదీ ప్రపంచవ్యాప్తంగా మారుతూ ఉంటుంది. నెలవంక స్పష్టంగా కనిపించకపోవడంతో దేశంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పండుగను శనివారం జరుపుకోవడంలేదు. ఆదివారం జరుపుకోనున్నారు.