Mahesh Babu family spotted at hyderabad airport: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎప్పుడు కూడా ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తూ బిజీబీజీగా ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన కుటుంబంతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళుతుంటారు. తాజాగా మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి టూర్‌కు వెళుతూ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రత్యక్షమయ్యారు.
టూర్‌కు వెళుతూ మహేశ్, నమ్రత, సితార, గౌతమ్ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమైన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ ఫొటోల్లో మహేశ్ ఎప్పటిలాగానే అదిరిపోయే స్మార్ట్ లుక్‌తో కనిపించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. మహేశ్ ప్రస్తుతం పరశురాంతో కలిసి సర్కార్ వారి పాట సినిమాలో నటిస్తున్నారు. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశాలున్నాయి.