ప్రముఖ పర్యాటక స్థలం మనాలీ వాతావరణం ఇప్పుడు అందర్నీ బాగా ఆకర్షస్తోంది. స్నోఫాల్ తో అత్యద్బుతంగా కన్పించే మనాలీ మరోసారి అందుకు సిద్ధమైంది.
హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రాంతమైన మనాలీలో మంచువర్షం ప్రారంభమైంది. మంచు దుప్పటిలో కప్పుకున్న మనాలీ నగరం..రారమ్మని పిలుస్తోంది. లోయలో కురుస్తున్న మంచువర్షం..వ్యాపారులు, రైతులు, తోటమాలులకు ఆనందాన్నిస్తోంది. ఇక్కడి అందమైన దృశ్యాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయి. స్నో ఫాల్ తో మరింత అందంగా మారిన మనాలీ అందమైన దృశ్యాలు మీ కోసం..
మనాలీలో ప్రస్తుతం కురుస్తున్న హిమపాతాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొండకోనల్నించి పడుతున్న హిమపాతంతో పర్యాటకుల ఆనందం రెట్టింపవుతోంది.
మనాలీ రోడ్లపై ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకుంది. దాంతో స్థానికుల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతోంది. పర్యాటకులకు మాత్రం ఇదొక మంచి అనుభూతి
మనాలీ ఎత్తైన శిఖరాల్లో హిమపాతం..దిగువ ప్రాంతాల్లో వర్షంతో కులూ మనాలీలో చలిగాలులు ఎక్కువయ్యాయి. మనాలీలోని ఈ ప్రత్యేకతే అందర్నీ రారమ్మని ఆకర్షిస్తోంది.
కరోనా కారణంగా ప్రస్తుతం పెద్దగా పర్యాటకులు కన్పించడంలేదు. కానీ ఇక్కడి వాతావరణం మాత్రం చాలా ఆకర్షిస్తోంది. మనాలీ చూడ్డానికి..మనాలీ అందాలు వీక్షించడానికి వచ్చే పర్యాటకులు మాత్రం మురిసిపోతున్నారు. మనాలీలో ప్రస్తుతం మైనస్ టెంపరేచర్ ఉన్నాసరే...ఎంజాయ్ చేస్తున్నారు.