Bigg Boss Telugu 4: కంటెస్టెంట్ Monal Gajjar ప్రతి వారం ఎలా సేవ్ అవుతుందో తెలుసా?

  • Nov 29, 2020, 09:08 AM IST

బిగ్‌బాస్ తెలుగు 4లో అంతా ఊహించిందే జరిగింది కంటెస్టెంట్ మొనాల్ గజ్జర్ (Monal Gajjar) సేవ్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ దత్తపుత్రిక కాదని, ఇకనైనా ఆమెపై ట్రోలింగ్ ఆపేయాలని చెప్పేందుకు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.

1 /5

బిగ్‌బాస్ తెలుగు 4లో అంతా ఊహించిందే జరిగింది కంటెస్టెంట్ మొనాల్ గజ్జర్ (Monal Gajjar) సేవ్ అయింది. అయితే ఆమె బిగ్ బాస్ దత్తపుత్రిక కాదని, ఇకనైనా ఆమెపై ట్రోలింగ్ ఆపేయాలని చెప్పేందుకు కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్ మొనాల్ గజ్జర్‌కు ఏ విధమైన ఫేవర్ చేయలేదని తెలుస్తోంది.  (Photo Credit: Hotstar)

2 /5

కుమార్ సాయి, దివి, మెహబూబ్ లాంటి కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సందర్భంలోనూ మొనాల్‌ను తమ రేటింగ్ కోసమే బిగ్ బాస్ సేవ్ చేశారని విమర్శలొచ్చాయి. బిగ్‌బాస్ 4లో నామినేషన్స్‌లోకి వచ్చిన ప్రతిసారి విచిత్రంగా మొనాల్ గజ్జర్ సేవ్ అవుతున్నారని ఆమె బిగ్ బాస్ దత్తపుత్రిక అని ట్రోలింగ్ సైతం జరిగింది. కానీ మొనాల్ ఎమోషనల్ గేమ్‌తో పాటు కొన్ని అంశాలు ఆమెకు సహాయం చేస్తున్నాయి.  (Photo Credit: Hotstar)

3 /5

అవినాష్, అరియానా గ్లోరి, అఖిల్, మొనాల్ 12వ వారం నామినేషన్‌లో ఉన్నారు. అయితే బిగ్ బాస్ 4 హోస్ట్ నాగార్జున ఈ వారం ఎలిమినేషన్ నుంచి మొదటగా మొనాల్ గజ్జర్‌ను సేవ్ చేశారు. దీంతో బిగ్ బాస్ 4 అభిమానులకు, నెటిజన్లకు మరోసారి సందేహం మొదలైంది. దత్తపుత్రికను ఈసారి ముందే కాపాడాడు అని కామెంట్ చేస్తున్నారు. కానీ అసలు విషయం మిషన్ గుజరాత్ గురించి తెలుసుకుని రియలైజ్ అవుతున్నారు.  (Photo Credit: Hotstar)

4 /5

మొనాల్ గజ్జర్‌కు మొదట్నుంచీ గుజరాత్ నుంచి ఓట్లు వస్తున్నాయి. మిస్డ్ కాల్ నెంబర్, హాట్ స్టార్ ఓటింగ్ ద్వారా ఎక్కడి నుంచైనా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్‌కు ఓటు వేయవచ్చు. గుజరాతీ భామను బిగ్‌బాస్ విన్నర్‌ను చేయాలని ఆ రాష్ట్ర ప్రజలు, అభిమానులు మొనాల్ గజ్జర్‌కు మద్దతు తెలుపుతున్నారు. మిషన్ గుజరాత్ బాగా వర్కౌట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై నుంచి ముప్పై శాతం ఓట్లు వస్తుండగా.. డెబ్బై నుంచి 80 శాతం వరకు ఓట్లు గుజరాత్ రాష్ట్రం నుంచి వస్తున్నాయి.  (Photo Credit: Hotstar) Also Read : Photos of Mouni Roy: అందాలతో కైపెక్కిస్తోన్న నాగిని.. మౌనీ రాయ్ ఫొటోస్ వైరల్

5 /5

అభిజిత్, అఖిల్ ల మధ్య గొడవలు లేక వీరితో మొనాల్ జరిపే సంభాషణలు లాంటివి షో రేటింగ్ పెంచుతాయని.. అందుకే గుజరాతీ భామను ఇంటి నుంచి బయటకు పంపడం లేదనే వాదనలు ఉన్నాయి. ఈవారం అయితే అభిజిత్ స్థానంలో మొనాల్‌ను స్వాప్ చేసి నామినేషన్‌లోకి రావడంతో మొనాల్‌కు గుజరాత్ ప్రజల ఓట్లు, అభి ఫ్యాన్స్ ఓట్లు రావడంతో 12వ సేవ్ అయిన తొలి కంటెస్టెంట్‌గా మొనాల్ పేరును హోస్ట్ నాగార్జున ప్రకటించారు.   (Photo Credit: Twitter/StarMaa) Also Read : Bigg Boss Telugu 4: బెస్ట్ కెప్టెన్ హారిక.. వరస్ట్ ఎవరో తేల్చేందుకు రచ్చరచ్చ!