Fast Internet Tips: మీ మొబైల్ ఇంటర్నెట్ స్లో అయిందా.. ఈ టిప్స్ పాటించండి

  • Nov 30, 2020, 11:16 AM IST

ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు 4జీ సిమ్‌ను అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ ఫాస్ట్‌గా రావాలంటే 4జీ వాడకం తప్పనిసరి. కొన్ని సందర్భాలో వినియోగదారులు 4G సిమ్ వాడుతున్నా ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తుంది. అందుకు కొన్ని కారణాలుంటాయి. ఈ కింది టిప్స్ పాటిస్తే మీరు 4G ఇంటర్నెట్‌ను ఎంచక్కా వినియోగించుకోవచ్చు.

1 /6

ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు 4జీ సిమ్‌ను అందిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో ఇంటర్నెట్ ఫాస్ట్‌గా రావాలంటే 4జీ వాడకం తప్పనిసరి. కొన్ని సందర్భాలో వినియోగదారులు 4G సిమ్ వాడుతున్నా ఇంటర్నెట్ చాలా స్లోగా వస్తుంది. అందుకు కొన్ని కారణాలుంటాయి. ఈ కింది టిప్స్ పాటిస్తే మీరు 4G ఇంటర్నెట్‌ను ఎంచక్కా వినియోగించుకోవచ్చు.

2 /6

మీరు 4G సిమ్ వాడుతున్నా ఇంటర్నెట్ వేగంగా రాకపోవడానికి పలు కారణాలుంటాయి. అయితే 4G సిమ్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో వేసిన తర్వాత నెట్‌వర్క్ సెట్టింగ్ ఈ బ్యాండ్‌కు సెట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మీ నెట్‌వర్క్‌ను మాన్యువల్‌గా సెట్ చేయాలి. ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి నెట్‌వర్క్ సెట్టింగ్‌లలో మీకు కావలసిన నెట్‌వర్క్ (Preferred Network Type)లో 4G లేదా LTE ని ఎంచుకోవాలి.

3 /6

మీ మొబైల్‌లో మీరు రెగ్యులర్‌గా వాడని స్మార్ట్‌ఫోన్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమం. లేకపోతే ఆ యాప్స్ ర్యామ్ వేగాన్ని మందగించేలా చేస్తాయి. తద్వారా ఇంటర్నెట్ వేగం మందగిస్తుంది. నెట్‌వర్క్ సెట్టింగ్స్‌తో పాటు అనవసర యాప్స్ మొబైల్స్‌లో ఉన్నా ఇంటర్నెట్ వేగం తగ్గుతుంది. తక్షణమే అలాంటి యాప్స్‌ను రిమూవ్ చేయాలి.

4 /6

మీ ఫోన్‌లో ఎక్కువ ఫైల్‌లు వాడిన తర్వాత క్యాచీ (Cache) పెరిగిపోతోంది. దీని వల్ల మీ ఫోన్ నెమ్మదిస్తోంది. ఇంటర్నెట్ 4జీ రేంజ్ కన్నా తక్కువగా వస్తుంది. అందులో మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌కు వెళ్లి క్యాచీని తరచుగా డిలీట్ చేయాలి. కనీసం వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు మీ ఫోన్‌లో క్యాచీని రిమూవ్ చేస్తే ఫోన్ వేగం పెరిగి.. ఇంటర్నెట్ 4జీ స్పీడ్ అందుకుంటుంది.

5 /6

కొన్నిసార్లు జీపీఎస్, బ్లూ టూత్ ఆప్షన్స్ ఆన్ చేసి అవసరం అయిపోయాక ఆఫ్ చేయడం మరిచిపోతుంటాం. దీనివల్ల మీ ఇంటర్నెట్ 3జీ వేగంతో వస్తుంది. అందుకే అవసరమైన సందర్భాల్లోనే ఇంటర్నెట్ అధికంగా వినియోగించే యాప్స్‌ను ఆఫ్ చేసుకుంటే 4G స్పీడ్‌తో నెట్ వాడుకోవచ్చు.  Also Read : ​Best LIC Policies: 5 బెస్ట్ ఎల్ఐసీ పాలసీలు ఇవే..

6 /6

మీరు వాడుతున్నది 3జీ సిమ్ అయితే ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉంటుంది. మీ మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం కూడా వాటిల్లవచ్చు. కనుక మీరు 4G నెట్‌వర్క్, VOLTE నెట్‌వర్క్ వినియోగిస్తున్నట్లయితే మీ SIMను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకోవాలి. Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు