Home Loan Eligibility: మీరేమైనా ఇళ్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ..హోమ్‌లోన్ కోసం అప్లై చేయనున్నారా..అయితే ఇది మీ కోసమే. హోమ్‌లోన్ కోసం అప్లై చేసేముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. హోమ్‌లోన్ అప్లై చేసేముందు ఈ కొన్ని పనుల్ని చేస్తే.. తరువాత మీకు ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. అవేంటో తెలుసుకుందాం.
Home Loan Eligibility: ఒకవేళ మీకు ఎక్కువ హోమ్‌లోన్ కావల్సి ఉన్నా..మీ శాలరీ ప్రకారం అర్హత ఉండదు. ఆ సందర్భాల్లో మీ భార్య, తల్లిదండ్రులు, సోదరుడు లేదా సోదరితో జాయింట్‌గా తీసుకోవచ్చు. లోన్ రీ పేమెంట్ కోసం ఎక్కువ టెన్యూర్ తీసుకోవచ్చు.
Home Loan Eligibility: ఎక్కువ సందర్భాల్లో మీ రీ పేమెంంట్ హిస్టరీ, మంచి క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంక్ హోమ్‌లోన్ మంజూరు చేస్తుంటుంది. దీనివల్ల మీ హోమ్‌లోన్ త్వరగా మంజూరవుతుంది. చాలా సందర్భాల్లో మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే లోన్ త్వరగా లభిస్తుంది.
Home Loan Eligibility: మీ సేవింగ్ లేదా సేలరీ అక్కౌంట్ ఉన్న బ్రాంచ్‌లోనే హోమ్‌లోన్ కోసం అప్లై చేయడం మంచిది. మీ క్రెడిట్ హిస్టరీ బ్యాంకుకు ముందు నుంచీ తెలిసుంటే..రుణం తీసుకోవడం సులభమవుతుంది.
Home Loan Eligibility: మీరు ఎక్కడైతే ఇళ్లు లేదా ఫ్లాట్ తీసుకుంటున్నారో..దానికి సంబంధించి అన్నిరకాల రెగ్యులేటరీ క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోండి. బ్యాంక్ లిస్ట్‌లో చెక్ చేసుకోవచ్చు. ప్రతి బ్యాంకుకు అప్రూవ్డ్ ప్రోజెక్ట్ లిస్ట్ ఉటుంది. లేకపోతే హోమ్‌లోన్‌పై ప్రభావం పడవచ్చు.
Home Loan Eligibility: ఒకవేళ మీరు ఎక్కువ రుణం కోసం దరఖాస్తు చేస్తే..బ్యాంకు తిరస్కరించే అవకాశాలున్నాయి. మీకు ఎంతవరకూ రుణం పొందే అర్హత ఉందనేది తెలుసుకోండి. అలా తెలుసుకున్న తరువాత డౌన్‌పేమెంట్ కోసం ప్లాన్ చేసుకోండి.