iPhone Latest Update: ఐఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్, లేటెస్ట్ అప్‌డేట్ అందుబాటులో

మీరు ఐఫోన్ వాడుతున్నారా..అయితే మీకే ఈ శుభవార్త. యాపిల్ సంస్థ ఫోన్ పనితీరును మెరుగుపర్చుకునే అప్‌డేట్ విడుదల చేసింది. ఇటీవలే మార్కెట్‌లో ఐఫోన్ 13 విడుదల చేసిన యాపిల్ సంస్థ..ఐఫోన్ యూజర్ల కోసం తాజాగా అప్‌డేట్ అందించింది. ఆ వివరాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

iPhone Latest Update: మీరు ఐఫోన్ వాడుతున్నారా..అయితే మీకే ఈ శుభవార్త. యాపిల్ సంస్థ ఫోన్ పనితీరును మెరుగుపర్చుకునే అప్‌డేట్ విడుదల చేసింది. ఇటీవలే మార్కెట్‌లో ఐఫోన్ 13 విడుదల చేసిన యాపిల్ సంస్థ..ఐఫోన్ యూజర్ల కోసం తాజాగా అప్‌డేట్ అందించింది. ఆ వివరాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

1 /4

ఐఫోన్ ఎస్ఈ మోడల్ తరువాత మార్కెట్‌లో వచ్చిన ఐఫోన్ 6,7,8 లతో పాటు ఎక్స్‌ఆర్ సిరీస్, 11, 12, 13 మోడల్స్‌కు ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10.30 నిమిషాల్నించి ఈ అప్‌డేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2 /4

చివరిసారిగా ఐఫోన్ యూజర్లకు అందిన అప్‌డేట్ 14.8 వెర్షన్. ఇప్పుడు తాజాగా వచ్చిన ఐఓఎస్ 15 అప్‌డేట్ చేసుకుంటే ఫోన్ పనీతీరు మరింత మెరుగ్గా మారుతుంది. మరీ ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్ ఎక్స్‌ప్లోర్ విభాగాల్లో అప్‌డేట్ ఉపయోగపడుతుంది. 

3 /4

వరల్డ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఐఓఎస్ 15కు సంబంధించిన వివరాల్ని యాపిల్ సంస్థ వెల్లడించింది. అప్పట్నించి అప్‌డేట్ ఎప్పుడు విడుదలవుతుందా అని యూజర్లు ఆసక్తిగా ఎదురు చూశారు. 

4 /4

ఐఫోన్ యూజర్లు ఎదురుచూస్తున్న ఐఓఎస్ 15 అప్‌డేట్ విడుదలైంది. 2021 సెప్టెంబర్ 20 నుంచి ఈ అప్‌డేట్ కస్టమర్లకు అందుబాటులో రానుంది.