PMK announces cash reward if anyone attacks Suriya: తమిళ స్టార్ హీరో సూర్యపై పీఎంకె (Pattali Makkal Katchi) పార్టీ యుద్ధం ప్రకటించింది. సూర్య నటించిన జైభీమ్ (Suriya Jai Bhim) చిత్రంలో వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలను తొలగించాలని.. ఆ సామాజికవర్గానికి హీరో సూర్య, చిత్ర దర్శకుడు జ్ఞానవేల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది. తాజాగా మైలదుతరై జిల్లాలోని ఓ థియేటర్‌లో జైభీమ్ చిత్ర ప్రదర్శనను పీఎంకె కార్యకర్తలు అడ్డుకున్నారు.
అనంతరం పీఎంకె(PMK) జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం మైలదుతరై ఎస్పీ కార్యాలాయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. వన్నియార్ సామాజికవర్గాన్ని (Vanniyar community) కించపరిచిన సూర్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. హీరో సూర్యపై ఎవరైనా దాడి చేస్తే రూ.1లక్ష బహుమతిగా అందజేస్తానని ప్రకటించారు.
ఇదే అంశంపై మూడు రోజుల క్రితం పీఎంకె చీఫ్ అన్బుమణి రామదాస్ హీరో సూర్యకు (Suriya) లేఖ రాయడం... దానికి ఆయన స్పందించడం తెలిసిందే. 'నాకు గానీ నా టీమ్‌కు గానీ ఏ సామాజికవర్గాన్ని కించపరిచే ఉద్దేశం లేదు. కొంతమంది వ్యక్తులు కొన్ని తప్పుల్ని ఎత్తి చూపగానే వాటిని మేము సవరించుకున్నామనే విషయం మీకు తెలుసునని భావిస్తున్నాను. క్రియేటివిటీ పేరుతో ఏ సామాజికవర్గాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదనే మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అదే స్పూర్తితో సృజనాత్మక స్వేచ్చను బెదిరింపుల నుంచి రక్షించాలనే విషయాన్ని మీరు కూడా అంగీకరిస్తారని నమ్ముతున్నాను.' అని సూర్య రామదాస్‌కు బదులిచ్చారు.
Also Read:Natu natu song dance videos: నాటు నాటు నాటు.. ట్రాఫిక్ సిగ్నల్లో నాటు స్టెప్పులు
జైభీమ్ చిత్ర యూనిట్ వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచిందనే ఆరోపణలను సూర్య కొట్టిపారేశారు. సినిమా ప్రారంభంలోనే ఈ చిత్రంలోని పాత్రలన్నీ కల్పితమేనన్న డిస్‌క్లెయిమర్ వేశామని గుర్తుచేశారు. రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రు ఒక కేసులో న్యాయాన్ని నిలబెట్టేందుకు చేసిన న్యాయ పోరాటమే జైభీమ్ మూల కథ అన్నారు. అనవసరంగా పేర్ల చుట్టూ రాజకీయం చేయవద్దని హితవు పలికారు. తాను అన్ని వర్గాల ప్రజలను ప్రేమిస్తానని చెప్పారు. మరోవైపు తమిళనాడులోని వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హీరో సూర్య, దర్శకుడు జ్ఞానవేల్‌లకు (Jai Bhim) లీగల్ నోటీసులు పంపించారు. ఈ ఇద్దరూ తమ సామాజికవర్గానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Suriya Jai Bhim: హీరో సూర్యపై దాడి చేస్తే రూ.1లక్ష... పీఎంకె నేత సంచలన ప్రకటన
హీరో సూర్యపై భగ్గుమంటోన్న పీఎంకె పార్టీ
జైభీమ్ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్న పార్టీ శ్రేణులు
హీరో సూర్యపై దాడి చేస్తే రూ.1లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటన