4 day work week, change in salary : ఇప్పటికే చాలా కంపెనీలు ఐదు రోజుల పని విధానంలో నడుస్తున్నాయి. అయితే ఆ విధానం మారనుంది. వారానికి నాలుగు రోజులే పని అనే కొత్త విధానం రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేయాలని భావిస్తోంది.
4 day work week change in salary What New Labour Codes have in store : కొత్త ఏడాదిలో మనదేశంలో కొత్త పని విధానాన్ని అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ప్రతి ఉద్యోగి నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. మూడు రోజులు వీకాఫ్‌గా తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.
కొత్త ఏడాదిలో మనదేశంలో కొత్త పని విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొత్త కార్మిక విధానం రూపొందింది.
భారత్‌లో కొత్త కార్మిక విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. వారంలో మూడు రోజులు వీకాఫ్‌గా ఉద్యోగులు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.
కేంద్రం కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్ర ఇప్పటికే వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఆరోగ్యం, పని చేసే పరిస్థితులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంది. (Pic source : Reuters)
కార్మిక వ్యవస్థ కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోని అంశం కావడంతో కొత్త లేబర్ కోడ్స్ అమలుపై మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం.
కొత్త వేతన విధానం అమల్లోకి వస్తే ఉద్యోగుల జీత విధానాల్లో మార్పులు వస్తాయి. వేతనాల్లో బేసిక్‌పేతో పాటు డీఏ, రిటెన్షన్ పేమెంట్లు ఉంటాయి. (Pic source : Reuters)
న్యూ లేబర్ కోడ్ ద్వారా ఉద్యోగికి చేతికి వచ్చే జీతాన్ని తగ్గించి.. ఆ అమౌంట్ ద్వారా పీఎఫ్, గ్రాట్యూటీ మొత్తాన్ని పెంచాలని చూస్తున్నారు.
కొత్త లేబర్ కోడ్లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2022-23లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. (Source: PTI)
ఫిబ్రవరి 2021లో ఈ కోడ్లకు సంబంధించిన ముసాయిదా నిబంధనలను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసింది.
కార్మిక విధానం అనేది ఉమ్మడి సబ్జెక్ట్ కావడంతో రాష్ట్రాలు కూడా వీటిని ఒకేసారి అమలు చేయాలని కేంద్రం కోరుతోంది.
ఏప్రిల్ 2021 నుంచే కొత్త లేబర్ కోడ్లను అమల విధానంపై కేంద్రం కసరత్తు చేయడం ప్రారంభించింది.