Lemon Benefits: ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక నిమ్మకాయను ఏదో ఒక రూపంలో తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి, కరిగే గుణమున్న ఫైబర్ చాలా లాభం చేకూరుస్తాయి. రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా హార్ట్ డిసీజ్, ఎనీమియా, కిడ్నీ స్టోన్స్, అజీర్థి వంటి సమస్యలు దూరమౌతాయి. అదెలాగో చూద్దాం.
ఒకవేళ మీ గొంతు సరిగా లేకపోతే వేడి నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఫలితముంటుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తీసుకోవాలి.
నిమ్మకాయలో విటిమిన్ సి అత్యధికంగా ఉంటుంది. అందుకే నిమ్మరసం తాగితే చాలా మంచిది
నిమ్మకాయ రసం వల్ల శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. రోగ నిరోధకశక్తి బలోపేతమవుతుంది. నిమ్మకాయలో పోక్టిన్ పేరుతో ఉండే ఫైబర్ ప్రీ బయోటిక్‌లా పనిచేస్తుంది. ఇది హెల్తీ బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది.
నిమ్మకాయ వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య పోతుంది. ఇందులో అధికంగా ఉండే సాయిటెట్ కారణంగా..కాల్షియం క్రిస్టల్‌గా ఏర్పడకుండా ఉంటుంది.
నిమ్మకాయ వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తొలగిపోతుంది. ఇందులో ఉండే సహజసిద్ధమైన క్లీజింగ్ గుణం లివర్‌కు మేలు చేకూరుస్తుంది. ఉదంయ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండి తాగాలి. దీని వల్ల శరీరంలోని విషపదార్ధాలు బయటకు వచ్చేస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.