Telangana Weather Report: తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 12 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు చోట్ల వడగళ్లతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
మరోవైపు హైదరాబాద్‌లోనూ పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే విధంగా బుధవారం (జనవరి 12) ఆదిలాబాద్, కొమురం భీంమ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
ఇవాళ ఉపరితల ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సముద్ర మట్టం నుంచి సగటు 0.9కి.మీ. ఎత్తు వద్ద ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అక్కడక్కడా వర్షాలు
సోమవారం రాత్రి నుంచే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. మంగళవారం, బుధవారం చాలా చోట్ల మాదిరి వాన కురిసే అవకాశాలున్నాయని వివరించారు.
రాష్ట్రంలోని సిద్ధిపేట, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు కురిశాయి. రోడ్లమీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతలు జలమయం అయ్యాయి.
Also Read: KTR reacting on Rythu Bandhu : వ్యవసాయ చరిత్రలోనే సువర్ణ అధ్యాయం లిఖించాం.. మాపై విమర్శాలా?
Also Read: Man Head: నల్గొండ జిల్లాలో షాకింగ్ సీన్.. దేవుడి విగ్రహం కాళ్ల వద్ద మొండెంలేని తల! నరబలి జరిగిందా?!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Weather Report: తెలంగాణలో పిడుగులతో కూడిన వర్షాలు- వాతావరణ కేంద్రం హెచ్చరిక