తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఐఏఎస్ అధికారుల బదిలీ జరగడం గమనార్హం. మంత్రివర్గంలో మార్పులు జరగడంతో పాలనాపరమైన మార్పుల్లో భాగంగా తాజాగా బదిలీలు జరిగాయి. పెద్ద ఎత్తున కలెక్టర్ల బదిలీ జరిగింది. కీలకమైన జిల్లాలకు అధికారులను మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Minister Vemula Prashanth Reddy Slams To Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్లీలో గలీజ్ దందాలు చేసి ఢిల్లీలో గులాంగిరి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Employees Double Hike Of Gratuity: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇన్నాళ్లు ఉన్న గ్రాట్యూటీని రెండింతలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచింది. దీంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తూ కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Konda Surekha Another Controversy Along With Seethakka: వివాదాలకు కేరాఫ్‌గా మారిన కొండా సురేఖ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆమె చేసిన అత్యుత్సాహం వివాదంలోకి నెట్టింది. అయితే తనతోపాటు మరో మంత్రి సీతక్కను ఆ వివాదంలో భాగం చేశారు. ఇంతకీ ఆ వివాదం ఏమిటి? అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.
Telangana Flag Host: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటితో 11 యేళ్లు పూర్తి చేసుకొని 12వ అడుగుపెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు అంబారాన్ని అంటాయి. ఈ సందర్భంగా శాసనసభ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్.
Telangana Formation Day: ఎన్నో దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. సరిగ్గా 2014 జూన్ 2వ తేదిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారు. వారి త్యాగాల పునాదులపై ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వెనక పెద్ద చరిత్రే ఉంది.
MLC Kavitha Likely To Resign BRS Party Very Soon: లేఖతో రాజుకున్న వివాదం ఇక సొంత దారి చూసుకునే స్థాయికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. 'నాన్న వెళ్లొస్తా' అని కవిత చెప్పనున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీలో భారీ పరిణామం చోటుచేసుకునేట్టు కనిపిస్తోంది.
Telangana Rains: తెలంగాణ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు పూర్తిగా కవర్ చేశాయని రాష్ట్ర వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Telangana PCC Executive List: తెలంగాణలో పీసీసీ కార్యవర్గం లిస్ట్ ఫైనల్ కావడంతో.. ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది..! ఇవాళో, రేపో పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..! దాంతో ఇన్నాళ్లు పదవుల కోసం పోటీపడిన నేతల్లో టెన్షన్ మొదలైంది..! లిస్టులో తమ ఉంటుందా..! లేక తమను పక్కన పెట్టేశారా..! ఇప్పుడు గాంధీభవన్‌లో ప్రతిఒక్కరు ఇదే విషయమై చర్చించుకుంటున్నారా..! ఇంతకీ లిస్ట్ ప్రిపరేషన్‌లో హై కమాండ్ తీసుకున్న లైన్ ఏంటి..! ఎందుకు ఆశవాహులో అంతలా టెన్షన్ నెలకొంది..!
KTR Sensational Comments With NRIs At Foreign Tour: ఎక్కడకు వెళ్లినా తెలంగాణ అభివృద్ధి కోసం పని చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Fans Tries To Attack On Jr NTR And Kalyan Ram: అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారిపై ఒక రకంగా దాడికి యత్నించారు. దీంతో కలకలం ఏర్పడింది. వెంటనే స్పందించిన ఎన్టీఆర్ అభిమానులతో కరచాలనం చేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది.
Telangana Rains:నేటి నుంచి తెలంగాణలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తెలంగాణలోని 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Revanth Reddy: తెలంగాణలో వానలు దంచి కొడుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది . వర్షాల కారణంగా రైతులు నష్టపోకుండా పలు నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం తడవకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ముందస్తు వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
Mumbai Heavy Rains: జోరు వానలకు దేశ ఆర్ధిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. 15 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు రావడంతో కుండపోతగా కురిసిన వర్షాలతో ముంబై చిగురుటాకులా వణికిపోయింది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో నేటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి.
KTR Three Words About Revanth Reddy Govt: దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు నమ్మి బొక్కబోర్ల పడ్డారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనను కేటీఆర్ మూడు అక్షరాల్లో చెప్పిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Heavy Rains: అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం కొనసాగుతుండగా… ఈ నెల 27న పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
K Kavitha Full Speech: తెలంగాణ రాజకీయాల్లో తాను రాసిన లేఖ సంచలనం రేపగా తొలిసారి బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తన తండ్రి కేసీఆర్‌కు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది? బీఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్నది ఏమిటి? ప్రతిపక్షాలు ఎలా కాచుకు కూర్చున్నావో మొత్తం కవిత వివరించారు. ఆమె పూర్తి ప్రసంగం ఇదే!
Telangana Rains: తెలంగాణలో రోహిణి కార్తె కాకముందే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ ను దాటి కేరళలో ప్రవేశించనున్నాయి. ఈ నెల 28న రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.