Heavy Rains in Telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు రేపు కూడ ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rain Forecast: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని 6 జిల్లాల్లో భారీ వర్షసూచన ఉండబోతుందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అధికారులతో పాటు ప్రజలకు తగు సూచనలు చేశారు.
Telangana Rains: తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా చిత్ర విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు వర్షాలు కురుస్తోన్న.. మరోవైపు ఉక్కబోతతో జనాలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
Telangana Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాలతో పాటు తూర్పు, పశ్చిమ షీర్ జోన్ ప్రభావంతో రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana IMD Alert: తెలంగాణలో నిన్నటి వరకు చాలా ప్రాంతాల్లో ఎండలు విరగకాసాయి. కానీ నిన్న సాయంత్రం నుంచి తెలంగాణలో వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులు పాటు పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains in Telangana: దేశంలో ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో మధ్యలో ఋతుపవనాలు మందకొడిగా సాగినా.. ప్రస్తుతం మాత్రం యాక్టివ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain Forecast Weather Report: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే వీలుందని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. అటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
Telangana IMD Alert: తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. పలు ప్రాంతాలలో ముసురు పట్టి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళ ఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం ప్రస్తుతం బెంగాల్, ఉత్తర ఒడిస్సా ప్రాంతాలలో కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
Telangana Rain alert: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ మహానగరంలో ఆదివారం నుంచి నిన్నటి వరకు ముసురు పట్టుకుంది. ఇపుడిపుడే ఎండలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా తెలంగాణకు మరో మూడు రోజులు పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Rains: తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాదు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిసాయి. మరోవైపు నేడు కూడా తెలంగాణలో రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Telangana Weather Updade: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రోజు రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ తెలిపింది. అంతేకాదు పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Low Pressure in Bay Of Bengal: వాయవ్య బంగాళ ఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, మన్యం, విశాఖ, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Hyderabad Rains: గత కొన్ని రోజులుగా ఎన్నడు లేనట్టుగా హైదరాబాద్లో వర్షం దంచి కొట్టింది. ఒక ఏరియాకు పరిమితం కాకుండా.. అన్ని మూడు మున్సిపల్ కార్పోరేషన్స్ పరిధిలో భారీ వర్షం కురిసింది. దీంతో గత కొన్ని రోజులుగా ఎన్నడూ లేనట్టుగా చాలా చోట్ల నీళ్లు నిలిచిపోయాయి. దాదాపు 10 ప్రాంతంలో కురవడంతో ప్రజలు ఊపరి పీల్చుకున్నారు. ఈ రోజు కూడా నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Hyderabad Rains: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తోన్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. ఇక సోమవారం నుంచి హైదరాబాద్లో కురుస్తోన్న వర్షం మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినా.. నిన్న అర్ధరాత్రి వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. పలు జిల్లాల్లో ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు వంటి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Telangana Weather Update: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Weather Alert: తెలంగాణకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయంటోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
Hyderabad Rains: హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాకా ఎడతెరపు లేకుండా కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో పలు కాలనీలు నీట మునిగాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో మెయిన్ ఏరియాల్లో వర్షపాతం నమోదు అయింది.
Hyderabad Heary Rain: కుండపోత వర్షంతో మంగళవారం హైదరాబాద్ తడిచి ముద్దయ్యింది. ఏకధాటిగా వర్షం పడడంతో హైదరాబాద్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో హైదరాబాద్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
Telangana Rain Alert: నైరుతి ఋతుపవనాలు ప్రవేశం తర్వాత తెలంగాణలో ఆశించినంత మేర వర్షపాతం కురవలేదు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా ఈ సీజన్లో దాదాపు 45 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రాజధాని హైదరాబాద్లో 60 శాతానికిపైగా లోటు వర్షపాతం నమోదు అయింది. గత వారం రోజులుగా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.మధ్యలో కాస్త తెరిపి ఇచ్చినా.. మళ్లీ పుంజుకున్నాయి.
Telangana Yellow Alert: తెలంగాణలో గత కొంత కాలంగా మందకొడిగా సాగుతున్న ఋతుపవనాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో ఈ రోజు రేపు భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.