India Corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ కొత్త కేసుల సంఖ్య రెండు వేలలోపే నమోదవడం గమనార్హం. మంగళవారం ఉదయం నుంచి ఇవాళ (బుధవారం) ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 1,778 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. మొత్తం 6,77,218 టెస్టులకు గానూ ఈ కేసులు నమోదైనట్లు వివరించింది.
ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ కారణంగా 62 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఆరోగ్య శాఖ. దేశంలో ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,16,605 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీనితో దేశంలో కొవిడ్ మరణాల రేటు 1.20 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం మధ్య 2,542 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 42,473,057 మంది కరోనా మహమ్మారిని జయించారు.
ఇండియాలో యాక్టివ్ కరోనా కేసులు..
దేశవ్యాప్తంగా ఇంకా 23,087 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల రేటు 0.05 శాతానికి తగ్గింది.
దేశంలో వ్యాక్సినేషన్ పంపిణీ ఇలా..
తాజాగా దేశవ్యాప్తంగా 30,53,897 డోసుల కరోనా టీకాలు పంపిణీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,81,89,15,234 వద్దకు చేరింది.
Also read: Assets Seized: ఆ ముగ్గురు ఆర్ధిక నేరగాళ్ల ఆస్థులు సీజ్, వెల్లడించిన కేంద్రమంత్రి
Also read: No Tollgate: నిన్న ఫాస్టాగ్..రేపు జీపీఎస్..జాతీయ రహదారులపై ఇక నో టోల్‌గేట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
India Corona Update: దేశంలో 2 వేల లోపే కొత్త కరోనా కేసులు- మరణాలు ఎన్నంటే..
దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో స్వల్ప వృద్ధి
కొత్తగా 2 వేల లోపే కొవిడ్ బాధితులు
మహమ్మారికి మరో 62 మంది బలి