/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

క్రిప్టో కరెన్సీకి రూపం లేదు.  కంప్యూటర్ లో జన్మించే ఈ డిజిటల్ కరెన్సీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త ట్రెండ్‌కు బీజం పోసింది. అయితే ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో చాలా మంది నిపుణులు ఈ కరెన్సీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఈ కరెన్సీని వాడే వాళ్లు మాత్రం ఇవేమి లెక్కచేయడం లేదు. దీంతో క్రిప్టో కరెన్సీకి జనాల్లో డిమాండ్ తో పాటు క్రేజ్ కూడా పెరిగిపోతోంది. మార్కెట్ పెరగడంతో లావాదేవీలు పెరిగిపోయాయి. దీంతో క్రిప్టో స్టాఫ్ పై పనిభారం పెరిగిపోయింది. ముఖ్యంగా సైబర్ క్రైమ్ యూనిట్‌లో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో క్రిప్టో సంస్థ పోలీసులపై దృష్టి సారించింది. చాలా కాలంగా సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసిన యూకే పోలీసులకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. అనుభవజ్ఞులైన ఆఫీసర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు ఏంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతోంది. ప్రస్తుత జీతాలకు రెండింతలు, మూడింతలకు పైగా చెల్లిస్తామని ఆఫర్ చేస్తోంది. క్రిప్టో దెబ్బకు యూకే ఎన్‌పీసీసీ విభాగం ఆందోళన చెందుతోంది. చాలా మంది సైబర్ నిపుణులు క్రిప్టో కార్యాలయాల్లో చేరడంతో యూకే సైబర్ క్రైం డిపార్ట్‌మెంట్ ఖాళీ అవుతోంది. 
 
అనుభవజ్ఞులైన సైబర్ క్రైమ్ ఆఫీసర్లను కోల్పోతున్నందుకు యూకే పోలీసు చీఫ్ కౌన్సిల్(ఎన్‌పీసీసీ) ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాజీనామాలతో సైబర్ డిపార్‌మెంట్ డీలా పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో ఈ పరంపర మరింత పెరిగే ప్రమాదం ఉండడంతో సైబర్ సెక్యూరిటీకి ప్రమాదం ఏర్పడనుందని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో తర్పీదు పొంది ఆఫీసర్లు కార్పోరేట్ రంగానికి పనిచేయడం తగదని అంటున్నారు. అయితే చాలీ చాలని జీతాలతో ఎంత కాలం నెట్టుకురావాలని కింది స్థాయి పోలీసు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. 

సొంతంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టాఫ్‌ను నియమించుకునే స్థాయికి క్రిప్టో కరెన్సీ చేరడం అందర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తమ కస్టమర్ల ఫండ్‌ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందని క్రిప్టో కరెన్సీ సంస్థ ప్రకటించింది. ఒకసారి నమ్మకం పోతే వ్యాపారం మూసుకోవాల్సిందే తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేసింది. అందుకే ఖర్చకు వెనకాడకుండా సొంతంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ స్టాఫ్‌ను నియమించుకుంటున్నామని ప్రకటించింది.  ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లకు కొదవ లేకపోవడంతో క్రిప్టో కరెన్సీ కూడా హ్యాకర్ల బారిన పడుతోంది. 2018 నుంచి ఎక్స్చేంజీలకు  హ్యాకర్ల నుంచి ముప్పు పెరిగిపోతోంది. దీంతో డిజిటల్ సెక్యూరిటీలో హై క్వాలిఫైడ్ ఆఫీసర్లను భారీ జీతాలు ఇచ్చి మరీ నియమించుకుంటోంది క్రిప్టో.

also read స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీకి ఈడీ ఝలక్ ... రూ.5,551 కోట్లు సీజ్

alsor read  రష్యా ఉక్రెయిన్ యుద్ధం హైదరాబాద్‌కు కలిసి రానుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
Cryptocurrency Information Security Jobs
News Source: 
Home Title: 

పోలీసులకు భారీ ఆఫర్లు ఇస్తున్న క్రిప్టో కరెన్సీ

పోలీసులకు భారీ ఆఫర్లు ఇస్తున్న క్రిప్టో కరెన్సీ
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

యూకే పోలీసులను ఆకర్శిస్తున్న క్రిప్టో 

భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్న క్రిప్టో 

ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్లను కోల్పోతున్నామంటూ పోలీసుల ఆవేదన

Mobile Title: 
పోలీసులకు భారీ ఆఫర్లు ఇస్తున్న క్రిప్టో కరెన్సీ
Publish Later: 
No
Publish At: 
Sunday, May 1, 2022 - 16:04
Request Count: 
47
Is Breaking News: 
No