స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీకి ఈడీ ఝలక్ ... రూ.5,551 కోట్లు సీజ్

ప్రముఖ మోబైల్ తయారీ సంస్థ షియోమీకి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఫెమా చట్టాలను ఉల్లఘించినందుకు గట్టిగా బదులు ఇచ్చింది. షియోమీ ఇండియాకు చెందిన రూ.5,551 కోట్లను జప్తు చేసింది. 

Last Updated : May 1, 2022, 03:20 PM IST
  • ప్రముఖ మోబైల్ తయారీ సంస్థ షియోమీకి ఈడీ ఝలక్
  • తమ మాతృ కంపెనీలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లింపు
  • ఫెమా చట్టాలను ఉల్లంఘించినట్లు ప్రకటించిన ఈడీ
 స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీకి ఈడీ ఝలక్ ... రూ.5,551 కోట్లు సీజ్

ప్రముఖ మోబైల్ తయారీ సంస్థ షియోమీకి ఈడీ ఝలక్ ఇచ్చింది. ఫెమా చట్టాలను ఉల్లఘించినందుకు గట్టిగా బదులు ఇచ్చింది. షియోమీ ఇండియాకు చెందిన రూ.5,551 కోట్లను జప్తు చేసింది. ఈ మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారికంగా ప్రకటించింది.  చైనా కంపెనీ అయిన షియోమీ భారత విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించడంతో ఈ చర్యలు అనివార్యం అయ్యాయని ఈడీ ప్రకటించింది. ఎమ్‌ఐ బ్రాండ్‌ మొబైల్‌ ఫోన్లకు షియోమీ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో భారత్‌లో వ్యాపారం చేస్తోంది. భారత్‌లో పంపిణీదారుగా,  ట్రేడర్‌ గా వ్యవహరిస్తోంది. కంపెనీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును సీజ్ చేసింది. విదేశీ లావాదేవీల్లో అవకతవకలను గుర్తించడం వల్లే ఫారెన్ ఎక్చ్సేంజీ మేనేజ్‌మెంట్ యాక్ట్, 1999లోని నిబంధనల ప్రకారం..  ఖాతాల్లోని సొమ్మును సీజ్ చేశామని ఈడీ ట్వీట్ చేసింది. 

రెండు నెలలుగా షియోమీపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ముంజు షియోమీ కార్ప్ ఇండియా మాజీ హెడ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. రికార్డులు సబ్‌మిట్ చేయాలని ఆదేశించింది. ఆతర్వాత ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఈడీ సమన్లకు షియోమీ స్పందించలేదు. భారతీయ చట్టాలకు లోబడే వ్యాపారం చేస్తున్నామని పదే పదే ప్రకటించింది. అన్నీ నిబంధనలను పాటిస్తున్నామని మీడియా ద్వారా ప్రకటన కూడా జారీ చేసింది. ఈడీ ఏ సమాచారం అడిగినా అందిస్తామని చెప్పింది. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. 

జియోమీ, ఒప్పో కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాల్లో ఉన్న తమ మాతృ కంపెనీలకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇది ముమ్మాటికీ ఫెమా చట్టాల ఉల్లంఘనే అని తెలిపింది. అందుకే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని వెల్లడించింది. మరోవైపు కిందటి ఏడాదిలో భారత్‌లో అత్యధిక స్మార్ట్‌ఫోన్లు అమ్మి షియోమీ రికార్డు సృష్టించింది.  భారత్ స్మార్ట్ ఫోన్ల్  మార్కెట్ లో షియోమీ ఏకంగా 24 శాతం వాటాను కలిగి ఉంది. 
 

ALSO READ  రష్యా ఉక్రెయిన్ యుద్ధం హైదరాబాద్‌కు కలిసి రానుంది

ALSO READ Akshaya Tritiya 2022: డిజిటల్ గోల్డ్‌ అంటే ఏమిటి? గూగుల్ పే ద్వారా గోల్డ్ కొనడం, అమ్మడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News