Cyber Fraud with Aadhaar Card : దేశంలో సైబర్ మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లకు నేరుగా ఓటీపీ ఇచ్చి మరీ మోసపోతుండగా, ఇంకొంతమంది పోలీసులం అని చెప్పి వస్తోన్న ఫేక్ కాల్స్ వలలో పడి బ్యాంకు ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.
క్రిప్టో సంస్థ పోలీసులపై దృష్టి సారించింది. చాలా కాలంగా సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేసిన యూకే పోలీసులకు బంపర్ ఆఫర్లు ఇస్తోంది. అనుభవజ్ఞులైన ఆఫీసర్లను తమ వైపుకి తిప్పుకునేందుకు ఏంతైనా చెల్లించేందుకు సిద్ధపడుతోంది.
How to Prevent Cyber Crimes: స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వినియోగం పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. తమ హ్యాకింగ్ స్కిల్స్‌కి మరింత పదును పెడుతూ జనం ఖాతాల్లోని సొమ్మును, విలువైన సమాచారాన్ని అప్పనంగా కాజేస్తున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లకు చెక్ పెడుతూ జనానికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి వారిని సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షించేందుకు కేంద్రం అన్ని విధాల కృషిచేస్తోంది.
Cyber Securities Index: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధిత రంగాల్లో ఇండియాదే పైచేయి అని మరోసారి నిరూపితమైంది. ఐటీలో అత్యంత కీలకంగా భావించే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీస్‌లో ఇండియా టాప్‌టెన్‌లో నిలిచింది. శత్రుదేశాల్ని చాలా వెనక్కి నెట్టేయడం విశేషం.
భారత దేశంపై పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతున్నాయి. ఇండియాపై సైబర్ దాడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఈ రెండు దేశాల నుంచి హ్యాకర్లు భారత వెబ్ సైట్లపై విరుచుకుపడుతున్నారు. మొత్తంగా లక్ష వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు వ్యూహం సిద్ధం చేశారు.
యూఐడిఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ మరియు ఏపీ రాష్ట్ర ఐటి సలహాదారు జె.సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే వెబ్ సైట్లలో ఆధార్ కార్డులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉండకూడదని తెలిపారు. అలాంటి డేటా ఉంటే వెంటనే తొలిగించాలని కూడా ఆయన ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.