రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భారత్‌కు కలిసి వస్తోంది. అక్కడి ఐటీ కంపెనీలను ఇతర దేశాలకు తరలించేందుకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో ఐటీ రంగంలో ముందు నుంచి మంచి ప్రతిభ కనబరుస్తున్న భారత్‌కు ఇది కలిసి రానుంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియకపోవడంతో ... అక్కడి ఐటీ సంస్థల్లో ఆందోళన నెలకొంది. ఈ రెండు దేశాల్లో అనవసరంగా పెట్టుబడి పెట్టామని ఆవేదన చెందుతున్నాయి. వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటపడాలని భావిస్తున్నాయి. భీకర దాడులతో అస్తవ్యస్థం అయిన ఉక్రెయిన్‌తో పాటు యుద్ధానికి దిగిన రష్యా కూడా ఇప్పుడు దురణంగా నష్టపోతోంది. కార్పోరేట్ సంస్థల వైఖరి మారడంతో ఉక్రెయిన్ కంటే రష్యానే ఎక్కువగా నష్టపోతోంది. ఇక రష్యాలో ఐటీ కార్యకలాపాలు నిర్వహించలేమని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్స్,ఐటీ, ఇన్సూరెన్స్ కంపెనీలు తరళివెళ్లిపోతున్నాయి. ఈ కంపెనీలను భారత్ ఆకర్శించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇలా తరలి వచ్చే ఐటీ కంపెనీల్లో కొన్ని మన హైదరాబాద్‌కు కూడా రానున్నాయి. దీంతో హైదారాబాద్ బేస్డ్ ఐటీ ఉద్యోగాలకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
ఇప్పుడిప్పుడే గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్....ఇంజినీరింగ్. పరిశోధన- అభివృద్ధి, బ్యాక్ ఆఫీస్ నిర్వహణ, డేటా ప్రాసెసింగ్, షేర్డ్ సర్వీసెస్ , కస్టమర్ సపోర్ట్ - మెయింటెనెన్స్ విభాగాలను ఆకర్శించనుంది. భారత్‌కు కొత్తగా 50,000 - 60,000 ఉద్యోగాలు వస్తాయని ఐటీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు దేశాలైన బల్గేరియా, రుమేనియా, పోలెండ్, మాల్డోవా, ఈస్తోనియా, బెలారస్, లాత్వియా, లిథుయేనియా వంటి దేశాలు తమ ఐటీ అవసరాల కోసం ఉక్రెయిన్, రష్యా పై ఇంత కాలం ఆధారపడ్డాయి. యుద్ధం కారణంగా తమ కార్యకలాపాలు సజావుగా నడిపించే అవకాశాలు లేకపోవడంతో ఐటీ సంస్థలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. దీంతో మరో ఆరు నెలల్లో ఈ రెండు దేశాలను కార్పోరేట్ కంపెనీలు ఖాళీ చేయనున్నాయి.
గత కొన్ని దశాబ్దాలుగా భారత్ ఐటీ ఎగుమత్తుల్లో 25 శాతం వాటా యూరప్ కు ఉంది. ఇందుకో ముఖ్యంగా పశ్చిమ ఐరోపా దేశాలతోనే భారత్ డీల్ చేస్తోంది. ఇక తూర్పు యూరప్ దేశాల ఐటీ కంపెనీలు ఉక్రెయిన్, రష్యాపై ఆధారపడ్డాయి. ఇప్పుడు యుద్దం కారణంగా మనకు తూర్పు యూరప్ దేశాల మార్కెట్ కూడా లభించినట్లు అయింది. ఇక భారత్ కు వచ్చే ప్రాజెక్టులను ఆకర్శించడంలో హైదరాబాద్.....ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పోటీ పడుతోంది. దీంతో హైదరాబాద్ కు త్వరలో మరిన్ని ఐటీ ఉద్యోగాలు రానున్నాయి.
also read Akshaya Tritiya 2022: డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి? గూగుల్ పే ద్వారా గోల్డ్ కొనడం, అమ్మడం ఎలా?
also read Amazon Summer Sales: 25 వేల రూపాయలు ఆ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 7 వేలకే, త్వరపడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.