Eesha Rebba Pics: చుడీదార్‌లో ఈషా రెబ్బా.. తెలుగు అందం అదిరిందబ్బా!

Eesha Rebba Latest chudidar PhotoShoot goes viral. మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. తాజాగా చుడీదార్‌లో ఫోటో షూట్ చేశారు. 
 

1 /6

మొన్నటి వరకు చిట్టి పొట్టి డ్రెసుల్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈషా రెబ్బా.. తాజాగా చుడీదార్‌లో ఫోటో షూట్ చేశారు. తాజా ఫోటోలలో తెలుగు అందం అదిరిపోయారు.   

2 /6

ఈ మధ్య కాలంలో ఈషా రెబ్బా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. తన హాట్ ఫొటోస్‌తో కుర్రకారుకు ఊపిరాడనీయకుండా చేస్తున్నారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు నెట్టింట లైకుల వర్షం కురుస్తుంటుంది.  

3 /6

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో ఈషా రెబ్బా కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే అవన్నీ సైడ్ క్యారెక్టర్లు కావడం గమనార్హం. హీరోయిన్‌గా ఓ మంచి సినిమా కోసం ఈషా ఎదురు చూస్తున్నారు.   

4 /6

అందంతో పాటు అభినయం ఉన్న ఈషా రెబ్బాకు సరైన సినిమా అవకాశాలు రాలేదనే చెప్పాలి. దాంతో సినిమాల కంటే కూడా వెబ్ సిరీస్ మీద ఫోకస్ పెట్టారు. తెలుగు ఓటీటీలో ఆమధ్య వచ్చిన 'పిట్ట కథలు', 'త్రీ రోజెస్'తో ఆకట్టుకున్నారు.   

5 /6

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'అ' మూవీలో ఈషా నటనకు మంచి మార్కులే పడ్డాయి. 'అరవింద సమేత వీరరాఘవ'లో హీరోయిన్ చెల్లి పాత్ర చేసి మెప్పించారు. బ్రాండ్ బాబులో హీరోయిన్‌గా ఆకట్టుకున్నారు.  

6 /6

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. బందిపోటు, అమీతుమీ లాంటి సినిమాల్లో తెలంగాణ యాసలో అదరగొట్టారు.